HPCL Jobs: పది లక్షల జీతంతో హిందుస్థాన్‌ పెట్రోలియం కంపెనీలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక.. | HPCL Biofuels Limited Recruitment 2022 for 58 Management and Non Management Posts. check qualification, pay scale details - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 12 December 2022

HPCL Jobs: పది లక్షల జీతంతో హిందుస్థాన్‌ పెట్రోలియం కంపెనీలో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక.. | HPCL Biofuels Limited Recruitment 2022 for 58 Management and Non Management Posts. check qualification, pay scale details

హెపీసీఎల్‌ బయోఫ్యూయల్స్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన 58 డీజీఎమ్‌, మేనేజర్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, సీనియర్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కెమిస్ట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన..

హెపీసీఎల్‌ బయోఫ్యూయల్స్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన 58 డీజీఎమ్‌, మేనేజర్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, సీనియర్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ కెమిస్ట్‌ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. షుగర్‌ ఇంజనీరింగ్‌, ఇథనాల్, షుగర్‌ ప్రొడక్షన్‌, కో-జెన్‌, జనరల్ అడ్మినిస్ట్రేషన్‌, ఫైనాన్స్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

పోస్టును బట్టి పదో తరగతి/బీఎస్సీ/బయోటిక్నాలజీ/కెమికల్‌ ఇంజనీరింగ్‌/ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌/లో బీటెక్‌, ఎన్విరాన్‌మెంట్‌/ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌లో ఎమ్మెస్సీ, ఎంబీబీఎస్‌/బీకాం/సీఏ/హెచ్‌ఎస్సీ/ఇంజనీరింగ్‌ డిప్లొమా/ఐటీఐ లేదా తత్సమాన డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. నవంబర్‌ 1, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 57 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 15, 2022వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలి. మేనేజ్‌మెంట్‌ పోస్టులను స్కైప్‌ ఇంటర్వ్యూ ద్వారా, నాన్‌ మేనేజ్‌మెంట్‌ పోస్టులను షార్ట్‌లిస్టింగ్‌, స్కిల్ టెస్ట్‌, మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి ఏడాదికి రూ.2.23 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

అడ్రస్..

HPCL Biofuels Ltd., House No. – 9, Shree Sadan. –Patliputra Colony, Patna – 800013.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages