Central Govt Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు. | Satluj jal vidyut nigam invites applications for various posts check here for full details Telugu Education News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 19 December 2022

Central Govt Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు. | Satluj jal vidyut nigam invites applications for various posts check here for full details Telugu Education News

SJVN Recruitment: సత్లుజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్‌లో (SJVN) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 150 ఖాళీలు ఉన్నాయి. ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

SJVN Recruitment: సత్లుజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్‌లో (SJVN) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఈ భారత ప్రభుత్వ రంగ సంస్థలో పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 150 ఖాళీలు ఉన్నాయి. ఏయే విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎన్విరాన్‌మెంట్‌, ఎఫ్‌ అండ్‌ ఏ, హెచ్‌ఆర్‌ విభాగాల్లో ఉన్న ఫీల్డ్‌ ఇంజినీర్‌, ఫీల్డ్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ/ బీటెక్‌/ బీఈ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ/ ఎంబీఏ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష/ రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 60,000 చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 21-12-2022న మొదలవుతుండగా, 10-01-2023తో ముగియనుంది.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages