75% Criteria for JEE 2023: జేఈఈలో మళ్లీ ఇంటర్‌ మార్కుల నిబంధన పునరుద్ధరణ ? | NTA plans to restore rule of 75 percentage criteria again for JEE - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 7 December 2022

75% Criteria for JEE 2023: జేఈఈలో మళ్లీ ఇంటర్‌ మార్కుల నిబంధన పునరుద్ధరణ ? | NTA plans to restore rule of 75 percentage criteria again for JEE

జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు ఇంటర్‌లో కనీస మార్కులు పొంది ఉండాలనే నిబంధనను ఎన్‌టీఏ మళ్లీ పునరుద్ధరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనైతే జేఈఈలో..

75% Criteria for JEE 2023: జేఈఈలో మళ్లీ ఇంటర్‌ మార్కుల నిబంధన పునరుద్ధరణ ?

75 percentage criteria in jee

జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ పరీక్షలకు ఇంటర్‌లో కనీస మార్కులు పొంది ఉండాలనే నిబంధనను ఎన్‌టీఏ మళ్లీ పునరుద్ధరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలోనైతే జేఈఈలో సాధించిన ర్యాంకుతోపాటు ఇంటర్మీడియట్‌లో కనీసం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందటం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ విద్యారులకైతే 65 శాతం మార్కులుంటే సరిపోతుంది. కరోనా ముందువరకు ఇదే పద్ధతిలో ప్రవేశాలు కల్పించేవారు. ఐతే కరోనా మహమ్మారి కాలంలో చాలా రాష్ట్రాలు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించకుండా ‘ఆల్‌పాస్‌’ ప్రకటించారు. దీంతో 2020, 2021, 2022లలో కనీస మార్కుల నిబంధనలను ఎత్తివేశారు. మార్కులతో సంబంధంలేకుండా ఇంటర్‌ పాసైనవారందరూ ప్రవేశ పరీక్ష ర్యాంకుతోనే ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశాలు పొందేలా వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టి, సాధారణ పరిసితులు నెలకొనడంతో వచ్చే ఏడాది జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌-2023కు మళ్లీ పాత నిబంధనలను అమలు చేయాలని ఎన్‌టీఏ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

జేఈఈ మెయిన్‌ను జనవరి, ఏప్రిల్‌లో నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ భావించినప్పటికీ ఇంత వరకు మొదటి దఫా నోటిఫికేషన్‌ ఇవ్వకపోవడంతో విద్యారుల్లో గందరగోళం నెలకొంది. నిజానికి నోటిఫికేషన్‌కు, పరీక్షకు మధ్య కనీసం 40 రోజుల వ్యవధి ఉండాలి. జనవరిలో జేఈఈ మెయిన్‌ నిర్వహించని పక్షంలో.. పరీక్ష ఫిబ్రవరిలోగానీ, మార్చిలోగానీ జరిపితే అకడమిక్‌ పరీక్షల కారణంగా ఇబ్బందులెదురవుతాయి. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభమవుతుండగా.. రాష్ట్రాల్లో ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్, మార్చి నెలలో ఇంటర్‌ పరీక్షలు మొదలవుతాయి. ఐతే ఎన్టీఐ మాత్రం జేఈఈకి సంబంధించి ఎటువంటి ప్రకటన ఇవ్వకపోవడంతో పరీక్ష ఎప్పుడనే దానిపై స్పష్టత కొరవడింది

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages