తెలుగు రాష్ట్రాల్లో భారీగా టీచర్‌ పోస్టులు.. ఏపీలో 50,677, తెలంగాణలో 18,588 టీచర్‌ పోస్టులకు త్వరలోనే.. | Teacher Jobs in AP and Telangana: 698 teaching and non teaching Job vacant in AP Kendriya vidyalaya schools - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 20 December 2022

తెలుగు రాష్ట్రాల్లో భారీగా టీచర్‌ పోస్టులు.. ఏపీలో 50,677, తెలంగాణలో 18,588 టీచర్‌ పోస్టులకు త్వరలోనే.. | Teacher Jobs in AP and Telangana: 698 teaching and non teaching Job vacant in AP Kendriya vidyalaya schools

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉపాధ్యాయపోస్టులకు నియామకాలు చేపట్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీఈడీ, టీటీసీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఉద్యోగ ప్రకటనల కోసం..

తెలుగు రాష్ట్రాల్లో భారీగా టీచర్‌ పోస్టులు.. ఏపీలో 50,677, తెలంగాణలో 18,588 టీచర్‌ పోస్టులకు త్వరలోనే..

Teacher Jobs in AP and Telangana

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనున్న కేంద్రీయ విద్యాలయాల్లో 698 టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణ దేవి డిసెంబరు 19న లోక్‌సభలో వైకాపా ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాత పూర్వక సమాధానం ఇచ్చారు. వీటికి సంబంధించిన ఖాళీలన త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

వీటితోపాటు ఏపీ లోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 50,677 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తం పోస్టుల్లో 16.64 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆయన తెలిపారు. అటు తెలంగాణ రాష్ట్రంలో 18,588 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. డిసెంబర్‌ 14న రాజ్యసభలో ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ అడిగిన ప్రశ్నకు ఆయన ఈమేరకు బదులిచ్చారు. ఈ లెక్కన రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉపాధ్యాయపోస్టులకు నియామకాలు చేపట్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక బీఈడీ, టీటీసీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఉద్యోగ ప్రకటనల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండిNo comments:

Post a Comment

Post Bottom Ad

Pages