UPSC Recruitment 2022: రాత పరీక్షలేకుండా యూపీఎస్సీ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూ.. | UPSC Recruitment 2022 for 43 Assistant Agricultural Marketing Adviser and Other posts, check full details - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday 27 November 2022

UPSC Recruitment 2022: రాత పరీక్షలేకుండా యూపీఎస్సీ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూ.. | UPSC Recruitment 2022 for 43 Assistant Agricultural Marketing Adviser and Other posts, check full details

కేంద్ర ప్రభుత్వ గనుల మంత్రిత్వశాఖ, ఆరోగ్య శాఖ, రక్షణ శాఖ తదితర శాఖల్లో ఖాళీగా ఉన్న.. 43 అసిస్టెంట్ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ అడ్వైజర్‌, సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, స్పెషలిస్టు తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

UPSC Recruitment 2022: రాత పరీక్షలేకుండా యూపీఎస్సీ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే నేరుగా ఇంటర్వ్యూ..

Union Public Service Commission

Srilakshmi C

|

Nov 27, 2022 | 6:22 PM




కేంద్ర ప్రభుత్వ గనుల మంత్రిత్వశాఖ, ఆరోగ్య శాఖ, రక్షణ శాఖ తదితర శాఖల్లో ఖాళీగా ఉన్న.. 43 అసిస్టెంట్ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ అడ్వైజర్‌, సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, స్పెషలిస్టు తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు పోస్టును బట్టి 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో డిసెంబర్‌ 15, 2022వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.25 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • అసిస్టెంట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అడ్వైజర్ పోస్టులు: 5
  • సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులు: 18
  • స్పెషలిస్ట్ గ్రేడ్ III పోస్టులు: 4
  • జూనియర్ మైనింగ్ జియాలజిస్ట్ పోస్టులు: 7
  • అసిస్టెంట్ మైనింగ్ జియాలజిస్ట్ పోస్టులు: 6
  • కెమిస్ట్ పోస్టులు: 3

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages