SAIL Recruitment 2022: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. ఈ విద్యార్హతలు అవసరం.. - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 4 November 2022

SAIL Recruitment 2022: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. ఈ విద్యార్హతలు అవసరం..

భారత ప్రభుత్వ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 245 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 3వ తేదీ నుంచి ప్రారంభమైంది. మెకానికల్‌ ఇంజనీరింగ్‌, మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌..

SAIL Recruitment 2022: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. ఈ విద్యార్హతలు అవసరం..

SAIL Management Trainee Recruitment 2022

భారత ప్రభుత్వ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 245 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్‌ 3వ తేదీ నుంచి ప్రారంభమైంది. మెకానికల్‌ ఇంజనీరింగ్‌, మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంనీరింగ్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి మైనింగ్‌ ఇంజనీరింగ్‌/కెమికల్‌ ఇంజనీరింగ్‌/సివిల్‌ ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే గేట్‌ 2022లో వ్యాలిడ్‌ స్కోర్‌ కూడా సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు నవంబర్‌ 23, 2022వ తేదీ నాటికి 28 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు నవంబర్‌ 23, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐతే జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ.700, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈఎస్ఎమ్‌ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించవల్సి ఉంటుంది. గేట్‌ 2022 స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన అభ్యర్ధులకు నెలకు రూ.50,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages