ISRO: విద్యార్థులకు ఇస్రో గుడ్‌ న్యూస్‌.. ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే.. | ISRO Offering free online course for school students check here for full details Telugu Education News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 17 November 2022

ISRO: విద్యార్థులకు ఇస్రో గుడ్‌ న్యూస్‌.. ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులు.. ఎలా అప్లై చేసుకోవాలంటే.. | ISRO Offering free online course for school students check here for full details Telugu Education News

భారతీయ అంతరిక్ష సంస్థ (ఇస్రో) విద్యార్థులకు బంపరాఫర్‌ ఇచ్చింది. ఆన్‌లైన్‌లో కోర్సులు పొందే అవకాశం కల్పించింది. 8వ తరగతి, ఆపై చదువుతున్న విద్యార్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కోర్సులో భాగంగా రిమోట్‌ సెన్సింగ్‌, జియో ఇన్‌ఫర్మేషన్‌ సైన్స్‌తో పాటు గణితం వంటి సబ్జెక్టులను…

భారతీయ అంతరిక్ష సంస్థ (ఇస్రో) విద్యార్థులకు బంపరాఫర్‌ ఇచ్చింది. ఆన్‌లైన్‌లో కోర్సులు పొందే అవకాశం కల్పించింది. 8వ తరగతి, ఆపై చదువుతున్న విద్యార్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇస్రో అధికారులు తెలిపారు. కోర్సులో భాగంగా రిమోట్‌ సెన్సింగ్‌, జియో ఇన్‌ఫర్మేషన్‌ సైన్స్‌తో పాటు గణితం వంటి సబ్జెక్టులను బోధిస్తారు. ఈ కోర్సులో అందించే అంశాలు ఏంటి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

* అంతరిక్ష్‌ జిగ్నాసా ప్రోగ్రామ్‌లో భాగంగా ఇస్రో ఈ కోర్సులను అందిస్తోంది.

* ఈ కోర్సులో భాగంగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌తో కూడిన రిమోట్‌ సెన్సింగ్ టెక్నాలజీని విద్యార్థులకు బోధిస్తారు.

* తరగతుల్లో అందరికీ అర్థమయ్యేలా విధంగా, ఫొటోలు, యానిమేసన్స్‌తో వివరిస్తారు.

* ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ రేడియేషన్‌, జియో స్టేషనరీ, సన్‌ సింక్రసన్‌ శాటిలైట్‌, రిమోట్‌ సెన్సార్స్‌ రకాలు, మల్టీస్పెక్ట్రల్‌ స్కానర్సర్‌, రిమోట్ సెన్సింగ్ వంటి అంశాలను బోధిస్తారు.

* విద్యార్థులకు రిమోట్‌ సెన్సింగ్ టెక్నాలజీ, భూ గ్రహంపై అవగాహన కల్పించేందుకు ఇస్రో ఈ తరగతులును నిర్వహిస్తోంది.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు తొలుత ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి.

* అనంతరం మీరు చదువుతోన్న పాఠశాలకు సంబంధించిన డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాలి.

* మీరు ప్రస్తుతం చదువుతోన్న పాఠశాల అనుమతులు తప్పనిసరిగా పొందాలి.

* తరగతుల ప్రారంభానికి సంబంధించిన వివరాలు ఈమెయిల్‌ ద్వారా పంపిస్తారు.

* ఏవైనా సందేహాలు ఉంటే websupport@iirs.gov.in. ఐడీకి మెయిల్‌ చేయొచ్చు.

ఇవి కూడా చదవండి



మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages