IIM Recruitment 2022: రూ.2 లక్షలకుపైగా జీతంతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలు అవసరం.. | IIM Bodh Gaya Recruitment 2022 for Senior Manager and Assistant Manager Posts, apply online - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 19 November 2022

IIM Recruitment 2022: రూ.2 లక్షలకుపైగా జీతంతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలు అవసరం.. | IIM Bodh Gaya Recruitment 2022 for Senior Manager and Assistant Manager Posts, apply online

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన బోధ్‌గయలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌.. ఎస్టేట్‌ కమ్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్‌ తదితర ఉద్యోగాల భర్తీకి అర్హులైన..

IIM Recruitment 2022: రూ.2 లక్షలకుపైగా జీతంతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగాలు.. ఈ అర్హతలు అవసరం..

IIM Bodh Gaya Recruitment 2022

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన బోధ్‌గయలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌.. ఎస్టేట్‌ కమ్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్‌ తదితర ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌ స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌, ఎంబీఏ, ఎమ్‌కాం, ప్రోస్టు గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే పోస్టును బట్టి సంబంధిత పనిలో ఏడాది నుంచి 15 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 30 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఎవరైనా డిసెంబర్‌ 6, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.2,09,200ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages