AP High Court: క్వశ్చన్ పేపర్ లొల్లి..! ఏపీపీఎస్సీ ఏఎంవీఐ నోటిఫికేషన్‌ 2022ను సస్పెండ్‌ చేసిన ఏపీ హైకోర్టు.. | Andhra Pradesh High Court Temporarily Suspended AMVI Recruitment Notification - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday 21 November 2022

AP High Court: క్వశ్చన్ పేపర్ లొల్లి..! ఏపీపీఎస్సీ ఏఎంవీఐ నోటిఫికేషన్‌ 2022ను సస్పెండ్‌ చేసిన ఏపీ హైకోర్టు.. | Andhra Pradesh High Court Temporarily Suspended AMVI Recruitment Notification

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) విడుదల చేసిన అసిస్టెంట్‌ మోటార్‌ వాహన ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ)-2022 నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. క్వశ్చన్ పేపర్ ..

AP High Court: క్వశ్చన్ పేపర్ లొల్లి..! ఏపీపీఎస్సీ ఏఎంవీఐ నోటిఫికేషన్‌ 2022ను సస్పెండ్‌ చేసిన ఏపీ హైకోర్టు..

AP High Court Suspended AMVI Recruitment

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) విడుదల చేసిన అసిస్టెంట్‌ మోటార్‌ వాహన ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ)-2022 నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. క్వశ్చన్ పేపర్  ఇంగ్లిష్ లోనే ఉంటుందన్న కమిషన్‌ ప్రకటనపై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాశీ ప్రసన్నకుమార్‌ హైకోర్టులో పిటీషన్‌ వేశారు. దీనిపై కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఐతే కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ప్రశ్నపత్రం ఇస్తామనడాన్ని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తప్పుబట్టారు. ప్రశ్నపత్రం ఆంగ్లంలోనే ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం నోటిఫికేషన్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు తెల్పింది. దీనిపై కౌంటర్‌ వేయాలని ప్రతివాదులను కోర్టు ఆదేశించింది.

కాగా ఆంధ్రప్రదేశ్‌లోని ట్రాన్స్‌పోర్ట్ సబార్డినేట్ సర్వీసులో మొత్తం 17 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీకి ఈ ఏడాది అక్టోబర్‌ 6న ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ రేపటితో (నవంబరు 22)తో ముగియనుంది. మెకానికల్ ఇంజినీరింగ్/ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా అర్హతతోపాటు, మోటారు డ్రైవింగ్ లైసెన్స్‌, మోటారు వాహనాలు నడపడంలో మూడేళ్ల అనుభవం, హెవీ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల ఎండార్స్‌మెంట్ అర్మతలుగా ఉండాలని సదరు ప్రకటనలో తెల్పింది. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో వివరించింది. ఐతే రాత పరీక్ష స్థానిక భాషలోకాకుండా ఇంగ్లిష్‌ భాషలో ఇస్తామనడంపై దాఖలైన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు సోమవారం విచారణ జరిపి, నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages