Amazon: నమ్మండి.. ఉద్యోగులను బలవంతంగా తొలగించలేదట… లేఆఫ్స్‌పై అమెజాన్‌ విచిత్ర వాదన… | No forcible layoffs all resignations were voluntary amazon india claims Telugu Business News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 25 November 2022

Amazon: నమ్మండి.. ఉద్యోగులను బలవంతంగా తొలగించలేదట… లేఆఫ్స్‌పై అమెజాన్‌ విచిత్ర వాదన… | No forcible layoffs all resignations were voluntary amazon india claims Telugu Business News

ఆర్థిక మాంద్యం పొంచి ఉందన్న నేపథ్యంలో టెక్‌ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తోన్న అంశం చర్చనీయాశంగా మారిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏకంగా లక్షకుపైగా మంది ఉద్యోగాలను కోల్పోయారు. వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యం తప్పదని ఆర్థిక నిపుణులు అంచనా..

ఆర్థిక మాంద్యం పొంచి ఉందన్న నేపథ్యంలో టెక్‌ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తోన్న అంశం చర్చనీయాశంగా మారిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏకంగా లక్షకుపైగా మంది ఉద్యోగాలను కోల్పోయారు. వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యం తప్పదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్న తరుణంలో కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. చిన్నచితక కంపెనీలే కాకుండా బడా కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రముఖ ఈ కామర్స్‌ సైట్ అమెజాన్‌ కూడా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఈ సంస్థ భారత్‌లో కొందరు ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వచ్చాయి.

అమెజాన్‌ భారత్‌లో భారీగా ఉద్యోగులను తొలగించిన కార్మిక చట్టాల ఉల్లంఘనకు పాల్పడిందంటూ నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయీస్‌ సెనేట్‌ (NITES) కేంద్ర కార్మిక శాఖకు ఇటీవల ఫిర్యాదు చేసింది. దీనిపై కార్మిక శాఖ అమెజాన్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ విషయమై అమెజాన్‌ ఇండియా స్పందించింది. తాము ఏ ఉద్యోగినీ బలవంతంగా విధుల్లో నుంచి తొలగించలేదని ప్రభుత్వానికి తెలిపింది. తాము ఇచ్చిన ప్యాకేజీని అంగీకరించి వారే స్వచ్ఛందంగా ఉద్యోగాలకు రాజీనామా చేశారని స్పష్టం చేసింది.

బెంగళూరులోని డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ ముందు అమెజాన్‌ ప్రతినిధి నేరుగా హాజరవ్వాల్సి ఉన్నప్పటికీ.. లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. ప్రతీ ఏటా తాము అన్ని విభాగాల్లో పనిచేసే ఉద్యోగులపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపాన అమెజాన్‌.. పునర్‌వ్యవస్థీకరణ అవసరమని భావిస్తే ఆ ప్రక్రియను చేపడుతామని తెలిపింది. ఒకవేళ ఉద్యోగులను తొలగించాల్సి వస్తే పరిహార ప్యాకేజీ చెల్లిస్తుంటామని తెలిపింది. ప్యాకేజీ నచ్చిన ఉద్యోగి సంస్థ నంఉచి వైదొలగొచ్చని, లేదంటే రిజక్ట్ చేసే అవకాశం కల్పిస్తుంటామని అమెజాన్‌ వివరించింది. మరి ఈ వివరణపై కార్మిక శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి



మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages