AIIMS Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌లో ఉద్యోగాలు.. అర్హతలేవంటే.. - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday 3 November 2022

AIIMS Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌లో ఉద్యోగాలు.. అర్హతలేవంటే..

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన జోధ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌.. జూనియర్ రెసిడెంట్స్ (నాన్ అకడమిక్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

AIIMS Recruitment 2022: రాత పరీక్షలేకుండా ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌లో ఉద్యోగాలు.. అర్హతలేవంటే..

AIIMS Jodhpur Recruitment 2022

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన జోధ్‌పూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌.. 50 జూనియర్ రెసిడెంట్స్ (నాన్ అకడమిక్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెడికల్‌ కౌన్సిల్ ఆఫ్‌ ఇండియా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు నవంబర్‌ 16, 2022వ తేదీ నాటికి 30 యేళ్లకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది.

ఈ అర్హతలున్నవారు నవంబర్‌ 16, 2022వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 12 గంటలలోపు కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకు నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూ సమయంలో జనరల్‌/ఓబీసీ అభ్యర్ధులు రూ.1000లు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద డిమాండ్‌ డ్రాఫ్ట్‌ను సమర్పించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఎంపికైన వారికి నెలకు రూ.56,100ల జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: Medical College, AIIMS, Jodhpur (Rajasthan).

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages