TSPSC Group1 Answer Key: టీఎస్పీయస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షకు 75 శాతం హాజరు.. మూడు రోజుల్లో ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday 16 October 2022

TSPSC Group1 Answer Key: టీఎస్పీయస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్షకు 75 శాతం హాజరు.. మూడు రోజుల్లో ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’

Tspsc Group 1 Answer Key

తెలంగాణలో గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష-2022 ఈ రోజు (అక్టోబర్‌ 16) విజయవంతంగా నిర్వహించారు అధికారులు. ఎక్కడా పొరబాట్లకు తావివ్వకుండా పకడ్బందీగా నిర్వహించడంతో పరీక్ష ప్రశాంత వాతావరణంలో ముగిసింది. పావుగంట ముందే పరీక్ష కేంద్రాల గేట్లను అధికారులు మూసివేశారు. పరీక్ష నిర్వహణలో తొలిసారి బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేశారు. ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పరీక్షకు అనుమతించలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు 1019 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 3 లక్షల 80 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2 లక్షల 86 వేల 51 మంది ప్రిలిమ్స్‌కు హాజరయ్యారు. బయోమెట్రిక్ విధానంతో ఫింగర్ ఫ్రింట్ తీసుకున్నాకే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఈ ప్రాసెస్‌ కాస్త ఆలస్యమైనా.. అనుకున్న సమయానికే పరీక్షను పూర్తిచేశారు. ఉదయం 8.30 గంటల నుంచే పరీక్ష హాల్‌లోకి అభ్యర్థులను అనుమతించారు. పరీక్ష ప్రారంభానికి ముందే 10 గంటల10 నిముషాలకు గేట్లు మూసేశారు. పరీక్షలో నిమిషం లేట్‌ నిబంధనను కచ్చితంగా అమలు చేశారు టీఎస్పీయస్సీ అధికారులు. నిమిషం లేట్‌ నిబంధనతో ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులు పరీక్ష రాయలేకపోయినందుకు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కఠిన వైఖరిపై ఆసహనం వ్యక్తం చేశారు.

75 శాతం మంది హాజరు

కాగా మొత్తం 503 పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఒక్కో పోస్టుకు 672 మంది పోటీ పడ్డారు. ప్రతిభ ఆధారంగా ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయినవారిని మెయిన్స్‌కు అనుమతించనున్నారు. మెయిన్స్‌ పరీక్షకు ఒక్కోపోస్టుకు 50 మందిని సెలెక్ట్‌ చేయనున్నారు. గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణపై TSPSCని అభ్యర్థులు అభినందించారు. పరీక్ష ప్రశ్నపత్రంపై మాత్రం ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేశారు. పరీక్షలో ప్రశ్నలు పెద్దగా ఉన్నాయని.. చదవడానికే టైం సరిపోలేదని ఆవేదన చెందగా.. మరికొందరు మాత్రం ప్రశ్నపత్రం తాము ఊహించినట్లుగా ఉందన్నారు. ఇంకొందరు అభ్యర్థులు మాత్రం ఒక ప్రశ్నకు ఇచ్చిన నాలుగు ఆప్షన్లలో రెండు ఆప్షన్లు సేమ్‌ ఉన్నట్లు చెప్పారు.

మరో మూడు రోజుల్లో ఆన్సర్‌ ‘కీ’ విడుదల

టీఎస్సీయస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణ అనంతరం.. జవాబు పత్రాలను అత్యంత భారీ భద్రత నడుమ తరలించారు. టీఎస్సీయస్సీ వెబ్ సైట్ ఓఎమ్మార్‌ ఆన్సర్ షీట్ స్కాన్ చేసి అందుబాటులో ఉంచుతుంది. ఆ తర్వాత ప్రిలిమినరీ పరీక్ష ప్రైమరీ కీ మూడ్రోజుల్లో విడుదల చేస్తుంది. ఐతే స్కానింగ్ ప్రాసెస్ కు మాత్రం 8 రోజుల సమయం పడుతుందని కమిషన్‌ వెల్లడించింది. ప్రైమరీ కీపై వచ్చే అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఫైనల్‌ కీ రిలీజ్‌ చేయనున్నారు. ఫైనల్‌ కీ తర్వాత.. రెండునెలల్లోపు ప్రిలిమినరీ ఫలితాలను విడుదల చేస్తామన్నారు టీఎస్సీయస్సీ చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి వెల్లడించారు.



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages