TSPSC Group 1 Answer Key: ఈ వారంలోనే తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 24 October 2022

TSPSC Group 1 Answer Key: ఈ వారంలోనే తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్‌ ‘కీ’ విడుదల..

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ ఈ వారంలో విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్‌ 16న నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్ష..

TSPSC Group 1 Answer Key: ఈ వారంలోనే తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్‌ 'కీ' విడుదల..

TSPSC Group-1 Prelim Answer Key 2022

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ ఈ వారంలో విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్‌ 16న నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్ష ఆన్సర్‌ ‘కీ’ని 8 రోజుల్లో విడుదల చేస్తామని ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రైమరీ ఆన్సర్‌ కీతోపాటు ఓఎంఆర్‌ షీట్‌ ఇమేజ్‌ స్కానింగ్‌లను కూడా వెబ్‌సైట్‌లో ఉంచనుంది. నిర్ణీత గడువులోగా ఈ ప్రక్రియ పూర్తిచేయాలని నిర్ణయించింది. ఆ ప్రకారంగా ఈ వారంలో కీ విడుదలచేయనున్నట్లు కమిషన్‌ అధికారిక వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్‌ 18వ తేదీ నుంచి ఓఎంఆర్‌ పత్రాల ఇమేజ్‌ స్కానింగ్‌ ప్రారంభమయ్యింది. పండగ సెలవుల్ని మినహాయించగా, అప్పటి నుంచి సరిగ్గా 8 వర్కింగ్‌ డేస్‌లో ప్రక్రియ పూర్తిచేయనుంది. ప్రైమరీ ఆన్సర్‌ కీ విడుదలయ్యాక, దీనిపై అభ్యర్థుల నుంచి గడువులోగా అభ్యంతరాలు స్వీకరించి, ఆ తర్వాత ఫైనల్‌ ఆన్సరీ కీ విడుదల చేయనుంది. ఫైనల్‌ కీ తర్వాత రెండునెలల్లోపు ప్రిలిమినరీ ఫలితాలను విడుదల చేస్తామని టీఎస్సీయస్సీ చైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

మరో వైపు గ్రూపు-1 మెయిన్స్‌ పరీక్షలకు అభ్యర్ధులు ప్రిపరేషన్‌ ప్రారంభించారు. మెయిన్స్‌ పరీక్షలపై ఉచిత అవగాహన కార్యక్రమాలను ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ ఐఏఎస్‌ అకాడమీ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 26 నుంచి 5 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఛైర్మన్‌ కృష్ణ ప్రదీప్‌ తెలిపారు. జనరల్‌ స్టడీస్‌, చరిత్ర, ఆర్థికం, పాలిటీ, గవర్నెన్స్‌ తదితర అంశాలపై ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానంలో సమగ్ర అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages