Telangana: నవంబర్‌ 2 నుంచి తెలంగాణ ఇంజనీరింగ్‌ విద్యార్ధులకు తరగతులు ప్రారంభం - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 26 October 2022

Telangana: నవంబర్‌ 2 నుంచి తెలంగాణ ఇంజనీరింగ్‌ విద్యార్ధులకు తరగతులు ప్రారంభం

వంబరు 2 నుంచి ఇంజనీరింగ్‌ విద్యా సంవత్సరం ప్రారంభించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆయా వర్సిటీలను ఆదేశించింది. ఓయూ, జేఎన్‌టీయూహెచ్‌ అధికారులతో విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి అక్టోబ‌రు 25న‌ నిర్వహించిన సమావేశంలో..

Telangana: నవంబర్‌ 2 నుంచి తెలంగాణ ఇంజనీరింగ్‌ విద్యార్ధులకు తరగతులు ప్రారంభం

Telangana First-year engineering classes

తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌-2022 కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తైన సంగతి తెలిసిందే. ఐతే ఇంటర్నల్‌ స్లైడింగ్‌, స్పాట్‌ ప్రవేశాలు పూర్తి కావాల్సి ఉంది. స్పాట్‌ అడ్మిషన్లకు సంబంధించిన గైడ్‌లైన్స్‌ అక్టోబ‌రు 26న‌ ఎంసెట్‌ వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. మేనేజ్‌మెంట్ కోటా కింద బీటెక్‌ సీట్ల భర్తీ గడువును నవంబరు 5వ తేదీ వరకు పెంచినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి అక్టోబ‌రు 25న‌ ప్రకటించింది. కాగా అక్టోబరు 25వ తేదీ నాటికి గడువు ముగియ నుండగా తాజాగా చవరి తేదీని పొడిగిస్తున్నట్లు తెల్పింది.

ఈ క్రమంలో నవంబరు 2 నుంచి ఇంజనీరింగ్‌ విద్యా సంవత్సరం ప్రారంభించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆయా వర్సిటీలను ఆదేశించింది. ఓయూ, జేఎన్‌టీయూహెచ్‌ అధికారులతో విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి అక్టోబ‌రు 25న‌ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. దీంతో నవంబరు 2 నుంచి బీటెక్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు తరగతులు ప్రారంభంకానున్నాయి. నవంబరు 2 నుంచి విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఓయూ టైం టేబుల్‌ను రూపొందించినట్లు లింబాద్రి తెలిపారు. జేఎన్‌టీయూహెచ్‌ కూడా ఒకటి, రెండు రోజుల్లో టైం టేబుల్‌ విడుదల చేస్తుందని ఆయన తెలిపారు. ఏఐసీటీఈ ఆదేశాల ప్రకారం వారం, రెండు వారాల పాటు ఓరియంటేషన్‌ కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత తరగతులను ప్రారంభించాలన్నారు. ఎంసెట్‌ మూడు విడతల సీట్ల కేటాయింపు ముగిసినా వాటికి మూడు నాలుగు రోజుల సమయం పడుతుంది.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages