Staff Selection Commission: నేడే చివరి రోజు.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో ఈ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఈ అర్హతలుంటే చాలు.. - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 18 October 2022

Staff Selection Commission: నేడే చివరి రోజు.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో ఈ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఈ అర్హతలుంటే చాలు..

Ssc Jobs

న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ద్వారా భారత వాతావరణ శాఖలో 990 గ్రూప్ ‘బి’ సైంటిఫిక్ అసిస్టెంట్‌ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మరి కొన్ని గంటల్లోనే ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ రోజు (అక్టోబర్‌ 18, 2022వ తేదీ) రాత్రి 11 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్, భౌతికశాస్త్రం/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ అప్లికేషన్స్ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అలాగే అభ్యర్ధుల వయసు అక్టోబర్‌ 18, 2022వ తేదీ నాటికి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఐతే దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఈ రోజు ముగింపు సమయంలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్‌లైన్‌ ఫీజు చెల్లింపులు అక్టోబర్ 20, 2022వ తేదీ వరకు నిర్వహించవచ్చు. ఆన్‌లైన్‌ రాత పరీక్ష (పార్ట్‌ -1, పార్ట్‌ -2) ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష డిసెంబర్ 2022 నెలలో నిర్వహిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

రాత పరీక్ష విధానం..

రాత పరీక్ష పార్ట్‌ -1, పార్ట్‌ -2లుగా ఉంటుంది. ఈ రెండింటికి కలిపి మొత్తం 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష 2 గంటల్లో రాయవల్సి ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

పార్ట్‌-1లో..

  • జనరల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ రీజనీంగ్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు
  • జనరల్‌ అవేర్‌నెస్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు
  • క్వాంటిటేవిట్‌ ఆప్టిట్యూడ్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు
  • ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, కాంప్రహెన్షన్‌లో 25 ప్రశ్నలకు 25 మార్కులు ఉంటాయి.

పార్ట్‌-2లో..

ఫిజిక్స్ / కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో 100 మార్కులకు ఉంటుంది. ఈ రెండు విభాగాలకు ఒకేసారి పరీక్ష జరుగుతుంది.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages