SSB Constable jobs 2022: సశాస్త్ర సీమా బాల్‌లో 399 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. టెన్త్‌ పాసైతే చాలు.. | Sashastra Seema Bal Recruitment 2022 for 399 Constable Posts, know how to apply - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday 5 October 2022

SSB Constable jobs 2022: సశాస్త్ర సీమా బాల్‌లో 399 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. టెన్త్‌ పాసైతే చాలు.. | Sashastra Seema Bal Recruitment 2022 for 399 Constable Posts, know how to apply

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సశాస్త్ర సీమా బాల్ (ఎస్‌ఎస్‌బీ).. 399 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సశాస్త్ర సీమా బాల్ (ఎస్‌ఎస్‌బీ).. 399 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 23 యేళ్ల మధ్య ఉండాలి. స్పోర్ట్స్‌లో అచీవ్‌మెంట్స్‌ సాధించినవారికి అదనపు ప్రయోజనాలుంటాయి. ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌ విధానంలో నోటిఫికేషన్‌ విడుదలైన 30 రోజుల్లోపు దరఖాస్తులు సమర్పించవచ్చు.

దరఖాస్తు సమయంలో జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్ధులు రూ.100లు దరఖాస్తు రుసుము చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌సర్వీస్‌మెన్‌/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఎంపిక విధానం, జీతభత్యాల వంటి ఇతర సమాచారం వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు.

అడ్రస్‌: Directorate General, Sashastra Seema Bal, East Block-V, RK Puram, New delhi-110066.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages