SBI PO Recruitment 2022: బ్యాంక్ జాబ్‌లకు చివరి అవకాశం! ఎస్బీఐలో 1673 పీఓ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? రేపే ఆఖరు.. - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday 11 October 2022

SBI PO Recruitment 2022: బ్యాంక్ జాబ్‌లకు చివరి అవకాశం! ఎస్బీఐలో 1673 పీఓ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? రేపే ఆఖరు..

భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌తో సహా దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది..

భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హైదరాబాద్‌తో సహా దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అక్టోబర్‌ 12, 2022వ తేదీ ముగింపు సమయంలోపు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి ఏప్రిల్‌ 1, 2022వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఐతే దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.750లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ప్రిలిమినరీ/మెయిన్స్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ పరీక్ష డిసెంబర్ 17, 18, 19, 20 తేదీల్లో నిర్వహిస్తారు. మెయిన్స్‌ పరీక్ష జనవరి/ఫిబ్రవరి 2023లో ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.41,960లు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • రెగ్యులర్ పోస్టులు 1600
  • బ్యాక్‌లాగ్ పోస్టులు 73

కేటగిరీ వారీగా ఖాళీలు..

ఎస్సీ- 270, ఎస్టీ- 131, ఓబీసీ- 464, ఈడబ్ల్యూఎస్‌- 160, యూఆర్‌- 648

ప్రిలిమినరీ రాత పరీక్ష విధానం..

మొత్తం 100 మార్కులకు, 100 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు ఆన్‌లైన్‌ విధానంలో గంట సమయంలో పరీక్ష జరుగుతుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 35 ప్రశ్నలకు 35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

మెయిన్‌ రాత పరీక్ష విధానం..

మొత్తం 155 ఆబ్జెక్టివ్‌ టైప్ ప్రశ్నలకు 200 మార్కులకుగానూ 3 గంటల సమయంలో పరీక్ష ఉంటుంది. రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌లో 40 ప్రశ్నలకు 50 మార్కులు, డాటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌లో 30 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్‌లో 50 ప్రశ్నలకు60 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో 35 ప్రశ్నలకు 40 మార్కుల చొప్పున ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. రెండు ఎస్సేలకు 20 మార్కుల చొప్పున 50 మార్కులకు 30 నిముషాల్లో డిస్క్రిప్టివ్‌ పరీక్ష ఉంటుంది. గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు ఉంటాయి.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages