Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సుల్లో మార్పులు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు.. - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 25 October 2022

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సుల్లో మార్పులు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు..

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ కోర్సుల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. క్రెడిట్స్‌ తగ్గించడం, ఇంటర్నల్స్‌కు మార్కులు పెంచడం, ఏకరూప ప్రశ్నపత్రం.. వంటి మార్పులకు..

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సుల్లో మార్పులు.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు..

Osmania University PG courses undergo major changes

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పీజీ కోర్సుల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. క్రెడిట్స్‌ తగ్గించడం, ఇంటర్నల్స్‌కు మార్కులు పెంచడం, ఏకరూప ప్రశ్నపత్రం.. వంటి మార్పులకు శనివారం జరిగిన ఓయూ స్టాండింగ్ కమిటీ సమావేశంలో అంగీకారం తెల్పింది. మార్పులతో కూడిన ఈ కొత్త విధానం 2022-23 విద్యా సంవత్సరం నుంచి అన్ని పీజీ కోర్సులకు వర్తిస్తుందని ఓయూ వెల్లడించింది. ప్రొఫెషనల్ కోర్సులు మినహా మిగతా అన్ని పీజీ కోర్సులకు మొత్తం 80 క్రెడిట్లు ఉంటాయి. అలాగే మూడు, నాలుగో సెమిస్టర్లలో ఎలక్టివ్స్‌ను 3 నుంచి 5కు పెంచింది.

క్వశ్చన్‌ పేపర్‌ మోడల్‌ ఒకే విధంగా..

పీజీ విద్యార్థులందరికీ ప్రాజెక్ట్, రీసెర్చ్ మెథడాలజీ పేపర్‌ను తప్పనిసరి చేసింది. దీంతో పీజీ చివరి సెమిస్టర్‌లో ప్రతి ఒక్కరూ ప్రాజెక్ట్ వర్క్‌ చేపట్టవల్సి ఉంటుంది. అలాగే ఇకపై వివిధ పీజీ కోర్సులకు వేర్వేరు క్వశ్చన్‌ పేపర్ల విధానాన్ని యూనివర్సిటీ రద్దు చేసింది. అంటే అన్ని సబ్జెక్టులకు క్వశ్చన్‌ పేపర్‌ మోడల్‌ ఒకేలా ఉంటుంది. పార్ట్-ఏ, పార్ట్-బీ విభాగాలతో సెమిస్టర్ పరీక్షలు ఏకరీతి నమూనాతో ఉంటాయి.

ఇకపై మూల్యాంకన విధానం ఇలా..

ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కులను 20 నుండి 30కి పెంచారు. సెమిస్టర్ పరీక్షలు 80కి బదులుగా 70 మార్కులకు ఉంటాయి. ప్రశ్నాపత్రంలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలను కూడా ఓయూ రద్దు చేసింది. దీంతో ఇంటర్నల్‌ పరీక్షల్లో కేవలం సబ్జెక్టివ్‌ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి.

పీజీ కోర్సుల్లోనే ఈ మార్పులు ఎందుకు?

ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం వంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ వంటి ఏ కోర్సునైనా అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్ అభ్యసించగలిగేలా కొత్త విధానాన్ని అమలు చేయాలని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్‌ భావిస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, ఎకనామిక్స్, ఇంగ్లీషు, తెలుగు కోర్సుల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నామని ఒక సీనియర్‌ అధికారి తెలిపారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages