Office of Custom Marine Recruitment 2022: 8వ/పదో తరగతి అర్హతతో.. కస్టమ్స్ మెరైన్ ఆఫీసులో గ్రూప్‌ ‘సీ’ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 19 October 2022

Office of Custom Marine Recruitment 2022: 8వ/పదో తరగతి అర్హతతో.. కస్టమ్స్ మెరైన్ ఆఫీసులో గ్రూప్‌ ‘సీ’ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల..

భారత ప్రభుత్వ రంగానికి చెందిన గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోనున్న కస్టమ్ మెరైన్ కార్యాలయం.. ట్రేడ్‌మ్యాన్, ఇంజన్‌ డ్రైవర్‌ ఇదితర గ్రూప్‌ ‘సీ’ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

Office of Custom Marine Recruitment 2022: 8వ/పదో తరగతి అర్హతతో.. కస్టమ్స్ మెరైన్ ఆఫీసులో గ్రూప్‌ 'సీ' పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల..

Custom Marine Staff Recruitment 2022

భారత ప్రభుత్వ రంగానికి చెందిన గుజరాత్‌లోని జామ్‌నగర్‌లోనున్న ఆఫీస్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్.. ట్రేడ్‌మ్యాన్, ఇంజన్‌ డ్రైవర్‌ ఇదితర గ్రూప్‌ ‘సీ’ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 8వ తరగతి, పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో 5 నుంచి 10 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 35 ఏళ్లకు మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్న అభ్యర్ధులు నవంబర్‌ 14, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అనంతరం హార్డు కాపీలను డౌన్‌లోడ్‌ చేసుకుని కింది అడ్రస్‌కు నవంబర్‌ 15, 2022వ తేదీలోపు దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన అభ్యర్ధులకు రూ.25,500ల నుంచి రూ,81,100ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • టిండెల్ పోస్టులు: 5
  • సుఖాని పోస్టులు: 10
  • ఇంజిన్ డ్రైవర్ పోస్టులు: 4
  • లాంచ్ మెకానిక్ పోస్టులు: 5
  • వ్యాపారి పోస్టులు: 2
  • సీమాన్ పోస్టులు: 1

అడ్రస్:

The Additional Commissioner (P&V),
Commissionerate of Customs (Preventive),
Jamnagar-Rajkot Highway,
Near Victoria Bridge,
Jamnagar-361001 (Gujarat).

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages