IGCAR Recruitment 2022: ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్‌లో రీసెర్చ్ స్టాఫ్‌ పోస్టులు.. ఈ అర్హతలుంటే చాలు.. - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 31 October 2022

IGCAR Recruitment 2022: ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్‌లో రీసెర్చ్ స్టాఫ్‌ పోస్టులు.. ఈ అర్హతలుంటే చాలు..

భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని కల్పక్కంలోనున్న ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్‌.. 60 జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

IGCAR Recruitment 2022: ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్‌లో రీసెర్చ్ స్టాఫ్‌ పోస్టులు.. ఈ అర్హతలుంటే చాలు..

IGCAR Kalpakkam Recruitment 2022

భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని కల్పక్కంలోనున్న ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్‌.. 60 జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిజికల్‌ సైన్స్‌, కెమికల్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌ సైన్స్‌ స్పెషలైజేషన్‌లో ఖాళీగా ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ/ఎంఎస్‌/ఎంఎస్సీ/ఎంఈ/ఎంటెక్‌/పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే గేట్‌/జెస్ట్‌/యూజీసీ నెట్‌/స్టెట్‌లో వ్యాలిడ్‌ స్కోర్‌ కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు 28 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 12, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. అనంతరం నింపిన దరఖాస్తులను కింది అడ్రస్‌కు నవంబర్‌ 15వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించాలి. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష డిసెంబర్‌ 5వ తేదీన నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.21,000ల నుంచి రూ.40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌:

The Assistant Personnel Officer [R]
Recruitment Section
Indira Gandhi Centre for Atomic Research
Kancheepuram District
Kalpakkam – 603 102
Tamil Nadu.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages