BEL Recruitment 2022: బీఈ/బీటెక్‌ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 12 October 2022

BEL Recruitment 2022: బీఈ/బీటెక్‌ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. 35 ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్‌ ఇంజినీర్, హల్దివర్‌(సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

BEL Recruitment 2022: బీఈ/బీటెక్‌ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌! భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

BEL Chennai Recruitment 2022

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన చెన్నైలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌.. 35 ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్‌ ఇంజినీర్, హల్దివర్‌(సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిల్లో ట్రైనీ ఇంజినీర్ పోస్టులు 22 ఉండగా, హల్దివర్‌ (సెక్యూరిటీ) పోస్టులు 1, ప్రాజెక్ట్‌ ఇంజినీర్ పోస్టులు 12 వరకు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సివిల్‌ విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు సెప్టెంబర్‌ 1, 2022వ తేదీ నాటికి 32 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 27, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ ఇంజనీర్‌ పోస్టులకు రూ.472, ట్రైనీ ఇంజనీర్‌ పోస్టులకు రూ.177లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. హల్దివర్‌(సెక్యూరిటీ) పోస్టులకు ఆఫ్‌లైన్‌ విధానంలో పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు నవంబర్‌ 2, 2022వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి కింది విధంగా జీత భత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

ట్రైనీ ఇంజినీర్ పోస్టులకు నెలకు రూ.30,000ల నుంచి రూ.40,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు నెలకు రూ.40,000ల నుంచి రూ.55,000 వరకు జీతంగా చెల్లిస్తారు
హల్దివర్‌(సెక్యూరిటీ) పోస్టులకు రూ.79,000లతోపాటు ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.

ఇంటర్వ్యూ అడ్రస్:

SR.DY.GENERAL MANAGER (HR&A),
BHARAT ELECTRONICS LIMITED,
BEL-ARMY ROAD,
NANDAMBAKKAM,
CHENNAI – 600 089,
TAMILNADU.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages