APPSC: ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖలోని ఈ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్‌..! - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 24 October 2022

APPSC: ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖలోని ఈ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్‌..!

ఆంధ్రప్రదేశ్ లో రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్‌బీకే) ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు. ఈ శాఖలో మొత్తం 6,758 అగ్రికల్చర్‌ అసిస్టెంట్, 4,000 హార్టికల్చర్‌ అసిస్టెంట్..

APPSC: ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖలోని ఈ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్‌..!

AP Agriculture Jobs

Srilakshmi C

|

Oct 24, 2022 | 3:02 PM




ఆంధ్రప్రదేశ్ లో రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్‌బీకే) ఖాళీగా ఉన్న పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు. ఈ శాఖలో మొత్తం 6,758 అగ్రికల్చర్‌ అసిస్టెంట్, 4,000 హార్టికల్చర్‌ అసిస్టెంట్, 400 సిల్క్‌ బోర్డు (పట్టు పరిశ్రమ) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అనుమతులు మంజూరయ్యాయి. ఐతే ఈ పోస్టుల్లో ఇప్పటివరకు 6,321 అగ్రికల్చర్‌ అసిస్టెంట్, 2,356 హార్టికల్చర్‌ అసిస్టెంట్, 378 సిల్క్‌ అసిస్టెంట్ పోస్టులను మాత్రమే భర్తీ చేశారు. మిగిలిపోయిన పోస్టులను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా త్వరలో భర్తీచేయనున్నట్లు కమిషనర్‌ హరికిరణ్‌ తెలిపారు. 5521 కాల్‌సెంటర్‌ నెంబర్‌ ద్వారా రైతు సమస్యలకు తక్షణ పరిష్కారం చూపిస్తున్నామని ఆయన అన్నారు. ప్రతి నెలా 1.51 లక్షల రైతు భరోసా మాస పత్రికలను ముద్రిస్తూ రైతులకు సాంకేతిక సలహాలు, సమాచారాన్ని అందిస్తున్నామని హరికిరణ్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages