తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TSCAB).. రాష్ట్రంలోని వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 40 మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి (Manager Posts) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

Telangana State Cooperative Apex Bank
TSCAB CTI Recruitment 2022: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ (TSCAB).. రాష్ట్రంలోని వివిధ బ్రాంచుల్లో ఖాళీగా ఉన్న 40 మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి (Manager Posts) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే తెలుగు భాషలో ప్రావీణ్యం కూడా ఉండాలి. దరఖాస్తుదారులు ఖచ్చితంగా లోకల్ అభ్యర్ధులై ఉండాలి. సెప్టెంబర్ 1, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 16, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు రూ.950, ఎస్సీ/ఎస్టీ/పీసీ అభ్యర్ధులు రూ.250లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 28 (రేపట్నుంచి) నుంచి ప్రారంభమవుతుంది. రాత పరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్) ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ రాత పరీక్ష నవంబర్ 2022లో ఉంటుంది. జీత భత్యాలు ఈ కింది విధంగా ఉంటాయి.
- మేనేజర్ పోస్టులకు రూ.36,000ల నుంచి రూ.63,840ల వరకు
- స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు రూ.17,900ల నుంచి రూ.47,920ల వరకు
ప్రిలిమినరీ పరీక్ష విధానం..
మొత్తం 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు, 100 మార్కులకు 60 నిముషాల వ్యవధిలో పరీక్ష నిర్వహిస్తారు.
- ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్‌లో 30 మార్కులకు 30 మార్కులు
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో 35 మార్కులకు 35 మార్కులు
- రీజనింగ్ ఎబిలిటీలో 35 మార్కులకు 35 మార్కులు
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.
No comments:
Post a Comment