TS SSC Supplementary Result: విద్యార్థులకు అలర్ట్‌.. తెలంగాణ టెన్త్‌ సప్లి ఫలితాలు వచ్చేశాయ్‌.. ఎలా తెలుసుకోవాలంటే.. | Telangana SSC Supplementary Results 2022 declared know how to check scorecard, marks sheet report on bse.telangana.gov.in - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 2 September 2022

TS SSC Supplementary Result: విద్యార్థులకు అలర్ట్‌.. తెలంగాణ టెన్త్‌ సప్లి ఫలితాలు వచ్చేశాయ్‌.. ఎలా తెలుసుకోవాలంటే.. | Telangana SSC Supplementary Results 2022 declared know how to check scorecard, marks sheet report on bse.telangana.gov.in

TS SSC Supplementary Result: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడదలయ్యాయి. అధికారులు ముందుగానే చెప్పినట్లు శుక్రవారం ఉదయం ఫలితాలను విడుదల చేశారు…

TS SSC Supplementary Result: విద్యార్థులకు అలర్ట్‌.. తెలంగాణ టెన్త్‌ సప్లి ఫలితాలు వచ్చేశాయ్‌.. ఎలా తెలుసుకోవాలంటే..

TS SSC Supplementary Results

TS SSC Supplementary Result: తెలంగాణ పదో తరగతి పరీక్షా ఫలితాలు విడదలయ్యాయి. అధికారులు ముందుగానే చెప్పినట్లు శుక్రవారం ఉదయం ఫలితాలను విడుదల చేశారు. సైఫాబాద్‌లోని డైరెక్టర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయంలో అధికారులు ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 55,652 మంది విద్యార్థులు హాజరవ్వగా వీరికోసం 204 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాజాగా విడుదల చేసిన సప్లిమెంటరీ ఫలితాల్లో మొత్తం మంది 79.82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ దేవసేన ఫలితాలను విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 48,167 మంది హాజరుకాగా 38,447 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలికల ఉత్తీర్ణత 82.21 శాతం కాగా, బాలురు 78.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత హాల్‌ టికెట్ నెంబర్‌తో పాటు ఇతర వివరాలను ఎంటర్‌ చేస్తే ఫలితాలు స్క్రీన్‌పై వస్తాయి.

ఇవి కూడా చదవండి



ఈ ఏడాది రెగ్యులర్‌ పరీక్షల్లో భారీగా ఉత్తీర్ణత శాతం సాధించిన విషయం తెలిసిందే. ఏకంగా 90 శాతం మంది విద్యార్థులు రెగ్యులర్‌ పరీక్షల్లో పాస్‌ అయ్యారు. అయితే ఫెయిల్ అయిన వారి కోసం ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించిన విషయం విధితమే.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages