TCS: ‘వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే’ ఉద్యోగులకు టీసీఎస్‌ ఆదేశాలు - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 25 September 2022

TCS: ‘వారానికి మూడు రోజులు ఆఫీసుకు రావాల్సిందే’ ఉద్యోగులకు టీసీఎస్‌ ఆదేశాలు

Tcs Ends Work From Home

Work From Home Ends At TCS: వారంలో కనీసం 3 రోజులు ఆఫీసులకు వచ్చి పనిచేయాల్సి ఉంటుందని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) తన ఉద్యోగులను కోరింది. ఆ మేరకు ఉద్యోగులకు ఈ మెయిల్‌లను పంపించింది. ఇప్పటికే టీసీఎస్‌ సీనియర్‌ ఎంప్లాయిస్‌ రెగ్యులర్‌గా ఆఫీస్‌ నుంచి వర్క్‌ చేస్తున్నారని, మిగిలిన ఎంప్లాయిస్‌ కూడా వారానికి కనీసం మూడు రోజుల పాటు ఆఫీసుకు రావల్సి ఉంటుందనేది సదరు ఈమెయిల్ల సారాంశం. ఐతే ఇది ఎప్పటి నుంచి ఇది అమలవుతుందనేది మాత్రం మెయిల్‌లో ప్రస్తావించలేదు. దీనిపై మరింత సమాచారం కోసం హెచ్‌ఆర్‌ మేనేజర్లను సంప్రదించాల్సిందిగా ఉద్యోగులకు సూచించిందని సమాచారం. రిటర్న్‌ టు ఆఫీస్‌లో భాగంగా, వారంలో కనీసం 3 రోజులు ఆఫీసుకి రావాలి. ఉద్యోగుల హాజరు గమనిస్తుంటాం. ఎవరెవరు ఎప్పుడెప్పుడు రావాలనే సమాచారాన్ని సంబంధించిన మేనేజర్లు తెలియజేస్తారు. ఏమైనా సహకారం కావాలంటే మీ హెచ్‌ఆర్‌ బిజినెస్‌ పార్ట్‌నర్‌ను సంప్రదించండి. రోస్టరింగ్‌కు కట్టుబడి పనిచేయవల్సి ఉంటుంది. కొత్త రూల్స్‌ పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉద్యోగులకు టీసీఎస్‌ పంపిన మెయిల్‌లో తెలిపారు. కాగా కొవిడ్‌ 19 మహమ్మారి కారణంగా వివిధ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కోవిడ్‌ ఉధృతి కొంత సర్దుమనిగినప్పటికీ.. ఉద్యోగులు మాత్రం తాము ఇంటి నుంచే పనిచేస్తామని కంపెనీలకు చెబుతున్నారు. దీంతో సదరు కంపెనీలు ఎంప్లయిస్‌ను తిరిగి కార్యాలయాలకు పిలిపించుకోవడానికి వివిధ పద్ధతులను అనుసరిస్తున్నాయి. మరోవైపు ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. 2025 కల్లా కొత్త పని విధానాన్ని కూడా టీసీఎస్‌ అమలు చేయనుందని, టీసీఎస్‌ 25X25పై దృష్టి సారించినట్లు, మొత్తం టీసీఎస్ ఉద్యోగుల్లో కనీసం 25 శాతం మంది ఉద్యోగులు ఆఫీసుల నుంచి పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విధానం వల్ల ఉద్యోగులకు ఇంటి నుంచి, ఆఫీసు నుంచి.. రెండింటి నుంచి పని చేసే అవకాశాన్ని కల్పించినట్లు అవుతుందని టీసీఎస్‌ అధికారిక వర్గాలు తెలిపాయి.



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages