SAIL Recruitment 2022: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో నెలకు రూ.2 లక్షలకు పైగా జీతంతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే.. | SAIL Rourkela Recruitment 2022 for 15 Medical Officer posts. check application details - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 10 September 2022

SAIL Recruitment 2022: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో నెలకు రూ.2 లక్షలకు పైగా జీతంతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే.. | SAIL Rourkela Recruitment 2022 for 15 Medical Officer posts. check application details

భారత ప్రభుత్వ సంస్థ అయిన రూర్కెలాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL Rourkela Steel Plant)లో.. 15 మెడికల్‌ ఆఫీసర్ (Medical Officer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

SAIL Rourkela Medical Officer Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన రూర్కెలాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL Rourkela Steel Plant)లో.. 15 మెడికల్‌ ఆఫీసర్ (Medical Officer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/డీఎన్‌బీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 41 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌లో అక్టోబర్‌ 14, 2022వ తేదీలోపు పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది.రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు సమయంలో రూ.700లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.2,20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌: DY. GENERAL MANAGER (PL-RECTT & GEN), BLOCK “E”, GROUND FLOOR, ADMINISTRATION BUILDING, ROURKELA STEEL PLANT, ROURKELA – 769 011 (ODISHA).

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages