Railway Recruitment 2022: భుసవ‌ల్ రైల్వే డివిజ‌న్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే రాత పరీక్షలేకుండా నేరుగా.. | Central Railway School Bhusawal Recruitment 2022 for 22 PGT, TGT, PRT Posts. check walk in dates - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 13 September 2022

Railway Recruitment 2022: భుసవ‌ల్ రైల్వే డివిజ‌న్‌లో టీచింగ్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే రాత పరీక్షలేకుండా నేరుగా.. | Central Railway School Bhusawal Recruitment 2022 for 22 PGT, TGT, PRT Posts. check walk in dates

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌రైల్వేలో భాగమైన భుసవ‌ల్ రైల్వే డివిజ‌న్‌లోని రైల్వే స్కూల్‌లో.. 22 పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ పోస్టుల (Teacher posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల..

Central Railway School Bhusawal Recruitment 2022: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్‌రైల్వేలో భాగమైన భుసవ‌ల్ రైల్వే డివిజ‌న్‌లోని రైల్వే స్కూల్‌లో.. 22 పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ పోస్టుల (Teacher posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌, హిందీ, మ్యాథ్స్‌, ఎక‌నామిక్స్, మ్యూజిక్‌, సైన్స్‌, ఆర్ట్స్ త‌దిత‌ర సబ్జెక్టుల్లో ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీ/ఎమ్మెస్సీ/మాస్టర్స్‌ డిగ్రీ/ఎలిమెంట‌రీ ఎడ్యుకేష‌న్‌లో రెండేళ్ల డిప్లొమా/ బీఈఐఈడీ/బీఏ/ బీఎస్సీ/ బీఏఈడీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత‌ సాధించి ఉండాలి. అలాగు టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు సంబంధిత డాక్యుమెంట్లతో కింది అడ్రస్‌లో అక్టోబర్‌ 4, 2022వ తేదీన నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. ఇంటర్వ్యూలో ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.21,250ల నుంచి రూ.27,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages