Notice Period: ఈ కంపెనీలో రాజీనామా చేసిన ఉద్యోగులకు10 శాతం అదనంగా జీతం చెల్లిస్తారు..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.. | This US company gives 10 percent hike its employees when they are on notice period - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 13 September 2022

Notice Period: ఈ కంపెనీలో రాజీనామా చేసిన ఉద్యోగులకు10 శాతం అదనంగా జీతం చెల్లిస్తారు..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.. | This US company gives 10 percent hike its employees when they are on notice period

సాధారణంగా ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగులు రాజీనామా చేసి, వేరే కంపెనీకి వెళ్లే సమయంలో నోటీస్‌ పిరియడ్‌ కండీషన్‌ ఉంటుంది. ఇది ఒక్కో కంపెనీకి ఒక్కో విధంగా ఉంటుంది. ఐతే ఈ కంపెనీ మాత్రం..

Notice Period: ఈ కంపెనీలో రాజీనామా చేసిన ఉద్యోగులకు10 శాతం అదనంగా జీతం చెల్లిస్తారు..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..

Notice Period

Srilakshmi C

|

Sep 13, 2022 | 5:25 PM




This company pays its employees to leave: సాధారణంగా ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగులు రాజీనామా చేసి, వేరే కంపెనీకి వెళ్లే సమయంలో నోటీస్‌ పిరియడ్‌ కండీషన్‌ ఉంటుంది. ఇది ఒక్కో కంపెనీకి ఒక్కో విధంగా ఉంటుంది. ఐతే అమెరికాలోని గొరెల్లా కంపెనీ మాత్రం తమ ఎంప్లాయిస్‌ పట్ల ఎంతో ఉదారతతో వ్యవహరిస్తోంది. రాజీనామా ఇచ్చిన ఉద్యోగుల నిర్ణయాన్ని గౌరవించడమేకాకుండా 10 శాతం అదనంగా జీతం కూడా చెల్లించి వారిని సగౌరవంగా సాగనంపుతోంది. గొరిల్లా సంస్థ సీఈఓ జాన్‌ ఫ్రాంకో లింక్డ్‌ఇన్‌తో మాట్లాడుతూ.. మా ఎంప్లాయిస్‌లో ఎవరైనా రాజీనామా చేస్తే నోటీస్‌ పిరియడ్‌లో భాగంగా 6 నెలల పాటు పనిచేయవల్సి ఉంటుంది. ఐతే ఉద్యోగులపై కఠిన నిబంధనలను ఉంచాలని మేమనుకోవడం లేదు. పైగా వారు కొత్త జాబ్‌ వెతుక్కోవడానికి కొంత సమయం పడుతుంది. అందుకే కేవలం 3 నెలల్లో వారు నిష్ర్కమించేలా కొత్త పాలసీని తీసుకొచ్చాం. మిగిలిన మూడు నెలలకు 10 శాతం అదనంగా జీతం కూడా చెల్లిస్తాము. ఉద్యోగులకు కఠిన నిబంధనల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా వారుకోరుకున్న ఉద్యోగం పొందడానికి ఈ విధానం ప్రోత్సాహకంలా పనిచేస్తుంది. ఈ పాలసీ ఎక్కువ మంది ఎంప్లాయిస్‌ కంపెనీ వీడేందుకు ప్రోత్సహించే ప్రమాదం కూడా లేకపోలేదు. నిజానికి, ఎంప్లాయిస్‌ కంపెనీ విడిచిపెట్టడం మాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. ఐతే ఉద్యోగులందరూ కంపెనీ విడిచిపెట్టాలని మేము భావించడం. కాకపోతే ట్రాన్సిషన్స్‌ సులువుగా ఉండేలా చూడడమే మా పాలసీ ఉద్దేశ్యం’ అని ఆయన అన్నారు. ఈ యూఎస్ కంపెనీ పాలసీని లింక్డ్‌ఇన్‌ ప్రశంసల్లో ముంచెత్తింది.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages