Neet: నీట్ పీజీ కౌన్సిలింగ్ ఎప్పటినుంచో తెలుసా.. సీట్ల సంఖ్య పెరిగే అవకాశం.. | Delay in NEET PG 2022 counselling process upsets aspirants Check latest updates - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 4 September 2022

Neet: నీట్ పీజీ కౌన్సిలింగ్ ఎప్పటినుంచో తెలుసా.. సీట్ల సంఖ్య పెరిగే అవకాశం.. | Delay in NEET PG 2022 counselling process upsets aspirants Check latest updates

వాయిదాలు పడుతూ వస్తున్న నీట్ పీజీ 2022 కౌన్సిలింగ్ ఈనెలలో ప్రారంభించే అవకాశం ఉంది. వాస్తవానికి సెప్టెంబర్ 1న ప్రారంభం కావల్సిఉన్నప్పటికి.. అనివార్య కారణాలతో కౌన్సిలింగ్ ప్రక్రియ ఆలస్యమవుతుంది. ఈదశలో సెప్టెంబర్ 19వ తేదీ నుంచి..

Neet PG Counseling: వాయిదాలు పడుతూ వస్తున్న నీట్ పీజీ 2022 కౌన్సిలింగ్ ఈనెలలో ప్రారంభించే అవకాశం ఉంది. వాస్తవానికి సెప్టెంబర్ 1న ప్రారంభం కావల్సిఉన్నప్పటికి.. అనివార్య కారణాలతో కౌన్సిలింగ్ ప్రక్రియ ఆలస్యమవుతుంది. ఈదశలో సెప్టెంబర్ 19వ తేదీ నుంచి నీట్ పీజీ కౌన్సిలింగ్ ప్రారంభం కావచ్చని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది. అదనంగా మరిన్ని సీట్లను ఈకౌన్సిలింగ్ లో చేర్చే ప్రక్రియలో భాగంగా నేషనల్ మెడికల్ కమిషన్ -ఎన్‌ఎంసికి సమయం ఇవ్వడానికి సెప్టెంబర్ 1 నుండి జరగాల్సిన నీట్ పిజి కౌన్సెలింగ్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వాయిదా వేసింది.
అధికారికంగా నీట్ పీజీ కౌన్సెలింగ్ తేదీని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇంకా ప్రకటించలేదు,

అధికారిక వర్గాల ప్రకారం, కౌన్సెలింగ్ సెప్టెంబర్ 19 నుండి ప్రారంభమవుతుందని సమాచారం. నీట్ పీఈఎస్ కౌన్సెలింగ్ 2022 సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రస్తుత అకడమిక్ సెషన్ కోసం లెటర్ ఆఫ్ పర్మిషన్ జారీ చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఇది సెప్టెంబర్ 15వ తేదీ నాటికి ముగుస్తుంది. దీంతో అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా, కౌన్సెలింగ్‌లో ఎక్కువ సీట్లను చేర్చడానికి సమర్థ అధికారం ద్వారా నీట్ పీజీ కౌన్సెలింగ్-2022 షెడ్యూల్‌ను రీషెడ్యూల్ చేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది దాదాపు 52,000 సీట్లకు నీట్ పీజీ కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. సెప్టెంబర్ ఒకటవ తేదీన ప్రారంభం కావాల్సిన నీట్ పీజీ-2022 కౌన్సిలింగ్ ప్రక్రియన్ రద్దు చేస్తూ కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ ఆగష్టు 29వ తేదీన ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి



మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages