Medical Education: ఉక్రెయిన్‌ మెడికల్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌! భారత్‌లో వైద్య విద్యనభ్యసించేందుకు గ్నీన్‌సిగ్నల్‌.. | Indian students from Ukraine universities allowed to complete medical education in other countries - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 7 September 2022

Medical Education: ఉక్రెయిన్‌ మెడికల్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌! భారత్‌లో వైద్య విద్యనభ్యసించేందుకు గ్నీన్‌సిగ్నల్‌.. | Indian students from Ukraine universities allowed to complete medical education in other countries

ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా అక్కడి నుంచి భారత్‌కు తిరిగొచ్చిన మెడికల్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్ తెల్పింది. ఇతర దేశాల మెడికల్‌ యూనివర్సిటీల్లో తమ చదువులు పూర్తిచేసుకునే వెసులుబాటునిస్తూ ఉక్రెయిన్‌ తాజాగా..

academic mobility programme offered by Ukraine: ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా అక్కడి నుంచి భారత్‌కు తిరిగొచ్చిన మెడికల్‌ విద్యార్ధులకు గుడ్‌న్యూస్ తెల్పింది. ఇతర దేశాల మెడికల్‌ యూనివర్సిటీల్లో తమ చదువులు పూర్తిచేసుకునే వెసులుబాటునిస్తూ ఉక్రెయిన్‌ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఉక్రెయిన్‌ అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్‌కు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) మంగళవారం (సెప్టెంబర్‌ 6) అంగీకారం తెల్పింది. ఇలా ఇతర దేశాల్లో మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తి చేసిన విద్యార్ధులకు ఉక్రెయిన్ యూనివర్సిటీ నుంచి మాత్రమే డిగ్రీని ప్రదానం చేయడం జరుగుతుంది. తాజా NMC చట్టం ప్రకారం.. ఫారిన్‌ మెడికల్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులు ఒకే యూనివర్సిటీ నుంచి మాత్రమే డిగ్రీని పొందే వెసులుబాటు ఉంటుంది. ఉక్రెయిన్ అందించే మొబిలిటీ ప్రోగ్రామ్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలల్లోని యూనివర్సిటీల్లో తాత్కాలిక పునరావాసం (temporary relocation) కల్పించేందుకు ఉద్ధేశించబడింది మాత్రమే. మెడికల్‌ విద్యను పూర్తి చేసినట్లు డిగ్రీలను ప్రధానం చేసేది మాత్రం ఉక్రెయిన్ యూనివర్సిటీనని నేషనల్ మెడికల్ కమిషన్‌ తన నివేదికలో తెల్పింది. ఉక్రెయిన్‌లో చదువుతున్న భారతీయ వైద్య విద్యార్థులు అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రామ్‌ ద్వారా డిగ్రీలను పూర్తి చేసేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని ఈ సందర్భంగా కమిషన్‌ తెల్పింది. కాగా విదేశాల్లో వైద్య విద్యనభ్యసించే విద్యార్ధులు మన దేశంలో స్క్రీనింగ్ టెస్ట్ రెగ్యులేషన్స్‌ను పూర్తి చెయ్యవల్సి ఉంటుంది. దీనిలో ప్రతిభకనబరచిన వారికి మాత్రమే మన దేశం గుర్తింపు లభిస్తుంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages