IIM Raipur Recruitment 2022: నెలకు రూ.67,700ల జీతంతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే.. | IIM Raipur Recruitment 2022 for 12 Placement Consultant, Sr Administrative Officer and Other Posts. apply online - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 19 September 2022

IIM Raipur Recruitment 2022: నెలకు రూ.67,700ల జీతంతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే.. | IIM Raipur Recruitment 2022 for 12 Placement Consultant, Sr Administrative Officer and Other Posts. apply online

రాయ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (IIM Raipur).. ఒప్పంద/రెగ్యులర్ ప్రాతిపదికన 12 ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Placement Consultant Post) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ..

IIM Raipur Non Teaching Recruitment 2022: రాయ్‌పూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (IIM Raipur).. ఒప్పంద/రెగ్యులర్ ప్రాతిపదికన 12 ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల (Placement Consultant Post) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులనుకోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, డిగ్రీ, ఎంబీఏ, పీజీ, సీఏ, సీఎంఏ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 35 నుంచి 55 యేళ్లకు మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 28, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం హార్డుకాపీలను డౌన్‌లోడ్‌ చేసుకుని కింది అడ్రస్‌కు అక్టోబర్‌ 5, 2022వ తేదీలోపు పంపించవల్సి ఉంటుంది. రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్ పోస్టులు: 1
  • సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు: 1
  • ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు: 1
  • సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 1
  • జూనియర్ ఇంజినీర్ పోస్టులు: 1
  • సిస్టమ్ అసిస్టెంట్ పోస్టులు: 2
  • లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు: 1
  • అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులు: 3
  • ఎస్టేట్ అసిస్టెంట్ పోస్టులు: 1

అడ్రస్‌: The Chief Administrative Officer
Indian Institute of Management Raipur
Near Village: Cheriya – Ponta
P.O. – Kurru (Abhanpur)
Atal Nagar, Raipur – 493 661 Chhattisgarh.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages