Good News: ఆ విద్యార్ధులకు OYO భారీ డిస్కౌంట్‌ ప్రకటన! కేవలం 2 రోజులు మాత్రమే.. | OYO Offers Discount to NDA, CDS Exam Aspirants Traveling to Test Centers: Here’s full details - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 3 September 2022

Good News: ఆ విద్యార్ధులకు OYO భారీ డిస్కౌంట్‌ ప్రకటన! కేవలం 2 రోజులు మాత్రమే.. | OYO Offers Discount to NDA, CDS Exam Aspirants Traveling to Test Centers: Here’s full details

నేషనల్ డిఫెన్స్‌ అకాడమీ (NDA), కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ (CDS)లలో ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న అభ్యర్ధులకు ఓయో బంపరాఫర్‌ ప్రకటించింది. ఈ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్ధులకు..

OYO Offers Discount to NDA, CDS Exam Aspirants: నేషనల్ డిఫెన్స్‌ అకాడమీ (NDA), కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ (CDS)లలో ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న అభ్యర్ధులకు ఓయో బంపరాఫర్‌ ప్రకటించింది. ఈ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్ధులకు ఓయో మల్టీనేషనల్‌ చైన్‌ ఆప్‌ హాస్పిటాలిటీ హోటల్స్‌ భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ప్రకటించింది. అదేంటంటే.. రేపు (ఆదివారం సెప్టెంబర్‌ 4, 2022) దేశ వ్యాప్తంగా నేషనల్ డిఫెన్స్‌ అకాడమి, నావెల్‌ అకాడమీ పరీక్షలు ఆఫ్‌లైన్‌ మోడ్‌లో జరగనున్నాయి. ఈ పరీక్షలకు లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వీటికి సంబంధించిన హాల్‌ టికెట్లు కూడా ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఇది ఆల్‌ ఇండియా ఎగ్జామ్‌ కాబట్టి.. దేశ నలుమూలల నుంచి అభ్యర్ధులు ఆయా పరీక్ష కేంద్రాలకు వెళ్లవల్సి వస్తుంది. ఆయా అభ్యర్ధులు తమ బడ్జెట్‌లను బట్టి పరీక్ష కేంద్రాలకు దగ్గరలో ఉండే హోటళ్లలో బస చేస్తుంటారు. ఐతే వీరు తమ ఓయో హోటల్స్‌లో స్టే చేస్తే మాత్రం దాదాపు 45 శాతం డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు ఓయో తెల్పింది. ఈ ఆఫర్‌ కేవలం ఓయో బ్రాంచ్‌ ఆఫ్‌ హోటల్స్‌ ఉన్న 19 నగరాలకు (ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, గౌతమ్ బుద్ధ నగర్, గుర్గావ్, లక్నో, చండీగఢ్, హైదరాబాద్, అహ్మదాబాద్, జైపూర్, ఇండోర్, లూథియానా, భువనేశ్వర్, పాట్నా, విశాఖపట్నం, వారణాసి, కోల్‌కతా, పూణే, డెహ్రాడూన్) మాత్రమే వర్తిస్తుంది. తమ హోటళ్లలో వైఫై ఫెసిలిటీ, ఎయిర్ కండీషనింగ్‌ వంటి అధునాతన సౌకర్యాలు కూడా ఉన్నాయని, ఈ ఆఫర్‌ కేవలం ఈ రోజు, రేపటికి (September 3 and 4) మాత్రమేనని తన ప్రకటనలో వివరించింది.

కాగా ఇండియన్ మిలిటరీ అకాడమీ- డెహ్రాడూన్, ది ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ- చెన్నై, ఇండియన్ నేవల్ అకాడమీ- ఎజిమల, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ – హైదరాబాద్‌లో ప్రవేశాలకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) ప్రతీయేట ఏడాదికి రెండు సార్లు ఎన్డీయే, సీడీఎస్‌ పరీక్షలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సెప్టెంబర్‌ 4వ తేదీన దాదాపు 400 పోస్టుల భర్తీకి పరీక్ష జరగనుంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages