Career: ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారా.. ఏది చేయడానికైనా రెడీ అయిపోతున్నారా.. ఇంటర్వ్యూకు వెళ్లేముందు కొంచెం ఆలోచించుకోండి.. | Tips for a Successful Interview - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday 24 September 2022

Career: ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారా.. ఏది చేయడానికైనా రెడీ అయిపోతున్నారా.. ఇంటర్వ్యూకు వెళ్లేముందు కొంచెం ఆలోచించుకోండి.. | Tips for a Successful Interview

చదువు పూర్తయిన తర్వాత వెంటనే మనం చేయాల్సింది ఏదైనా ఉద్యోగం(JOB). కొంత మంది చదువు పూర్తిచేసుకుని.. కాలేజీ క్యాంపస్ బయటకు రావడంతోనే ఉద్యోగంలో సెటిలవుతారు. మరికొంత మంది మాత్రం జాబ్..

Career: చదువు పూర్తయిన తర్వాత వెంటనే మనం చేయాల్సింది ఏదైనా ఉద్యోగం(JOB). కొంత మంది చదువు పూర్తిచేసుకుని.. కాలేజీ క్యాంపస్ బయటకు రావడంతోనే ఉద్యోగంలో సెటిలవుతారు. మరికొంత మంది మాత్రం జాబ్ కోసం ఎక్కిన గుమ్మం, దిగిన గుమ్మం అంటూ బయోడెటా పట్టుకుని ఎన్నో ఆఫీసులు తిరుగుతూ ఉంటారు. ఇలా చేసినా కొంతమందికే ఉద్యోగాలు దొరుకుతాయి. మరికొంత మందికి కష్టమే. దేశంలో నిరుద్యోగం (Unemployment) ఎక్కువుగానే ఉంది. ఇంజినీరింగ్ (Engineering), ఎంబీఏ(MBA) వంటి వృత్తివిద్యా కోర్సులు చేసినా ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారుతున్న ప్రస్తుత కాలంలో, ఉద్యోగం కోసం ప్రయత్నించడం కంటే స్వయం ఉపాధి బెటర్ అంటూ.. చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. కాని ఇది అందరికి కష్టం. ప్రభుత్వాలు ఎంతగా రుణం సాయం అందించి.. స్వయం ఉపాధి పొందాలని ప్రోత్సహించినా, అందరికి ఇది సాధ్యం కాదు. అందుకే చాలా మంది నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతూ.. ఉద్యోగ యత్నంలో మునిగి తేలుతూ ఉంటారు. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఉద్యోగాల కోసం యత్నిస్తూ కార్యాలయాల చుట్టూ తిరిగే యువత సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఎలాగైనా ఉద్యోగం సాధించి, పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడిపోవాలనే లక్ష్యంతో చదువు పూర్తి కాగానే బయోడెటా పట్టుకుని ఉద్యోగం కోసం వెతుకులాట ప్రారంభిస్తారు.

ఉద్యోగ అన్వేషణలో ఇబ్బందులు: కాలేజీ క్యాంపస్ లో చదువు వరకు ఆడుతూ, పాడుతూ గడిచి పోతుంది. అసలు సమస్య తర్వాతే ప్రారంభమవుతుంది. ఉద్యోగ వెతుకులాటలో ఎన్నో కష్ట, నష్టాలు, ఇబ్బందులు. కొన్ని సందర్భాల్లో తనకు ఉద్యోగం వస్తుందో, రాదో అనే అనుమానం కూడా కొంతమందిలో కలుగుతుంది. అయితే చాలా కార్యాలయాలు తమకు సంబంధిత పనిలో నైపుణ్యం ఉన్న వారి కోసం చూస్తాయి. కొన్ని పెద్ద కంపెనీలు అయితే యువతను ఉద్యోగాలకు ఎంపిక చేసుకుని, అవసరమైన నైపుణ్య శిక్షణను కంపెనీలే అందిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా.. ఇంకా ఉద్యోగాల కోసం వెతికే యువత సంఖ్య లక్షల్లోనే. దేశంలో ప్రతి ఏటా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటకు వస్తున్న వారిలో సగం మందికి పైగా ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు.

ఉద్యోగ ఖాళీలు: నిరుద్యోగుల సమస్య ఇలా ఉంటే.. మరోవైపు చాలా సంస్థలు కూడా తమకు ఉద్యోగుల కోసం నిరంతరం ఆయా కంపెనీల HR టీమ్ వెతుకుతూనే ఉంటుంది. తమ కంపెనీలో ఎన్నో ఖాళీలున్నాయని, అర్హులైన వారు నేరుగా ఇంటర్వ్యూలకు రావాలని చాలా కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. కాని ఇక్కడ వచ్చిన సమస్య ఒకటే స్కిల్డ్ పీపుల్. చాలా కంపెనీలు నైపుణ్యం ఉన్న వారి కోసం వెతుకుతున్నాయి. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన చాలా మంది యువతలో కమ్యూనికేషన్ స్కిల్స్, నైపుణ్యం లేక వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి.

ఉద్యోగ అన్వేషణలో చేస్తున్న పొరపాట్లు: ఉద్యోగ అన్వేషణలో ఉన్న చాలామంది చేస్తున్న పొరపాటు ఒక్కటే. తాము త్వరగా ఏదో ఒక ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో అసలు తాము ఏ ఉద్యోగం చేయాలనేది డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. ఏది దొరికినా చేసేద్దామనే ఉద్దేశంతో బయోడెటా పట్టుకుని ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు. దీంతో చాలామంది ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగం సాధించలేకపోతున్నారు. అందుకే ఇంటర్వ్యూకి వెళ్లే ముందు తాము ఏ ఉద్యోగం కోసం వెళ్తున్నాం. ఆ ఉద్యోగం తన అర్హతలకు సరిపోతుందో లేదో నిర్ణయించుకోవాలి.  తాను ఆ ఉద్యోగానికి కనీసం 50 శాతం అర్హత ఉంటే.. ఇంటర్వ్యూకి హాజరుకావాలి. లేకపోతే మౌఖిక పరీక్షలో నిరశా ఎదురుచూడాల్సి వస్తుంది.

ఒక ఉదాహరణ చూసుకుంటే.. ఓ కేంద్ర ప్రభుత్వ సంస్థలో క్యాజువల్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూకు కొంతమంది యువకులు హాజరయ్యారు. ఆ ఇంటర్వ్యూ చేసే ఓ ఉన్నతాధికారి నువ్వు ఏ ఉద్యోగం చేయగలవని అడిగారు. వెంటనే ఆ యువకుడు ఏదైనా చేస్తానని సమాధానం చెప్పాడు. వెంటనే ఆ అధికారి ఎయిరిండియా విమానం ఇస్తా నడపగలవా అని అడిగాడు.. కంగుతినడం ఇంటర్వ్యూకి వచ్చిన యువకుడి వంతైంది. ఆ యువకుడు ఆసమయంలో ఉద్యోగానికి ఎంపిక కాలేదు. అందుకే ఇంటర్వ్యూ సమయంలో మనపై మనం విశ్వాసంతో ఉండాలి. ఎటువంటి ప్రశ్న ఎదురైనా విశ్వాసంతో సమాధానం చెప్పాలి. ఇవ్వన్నీ జరగాలంటే ముందుగా ఏ ఉద్యోగం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాడో క్లారిటీతో ఉండాలి. ఉద్యోగ అన్వేషణలో ఉన్న నిరుద్యోగులు ఈఫండమెంటల్స్ ఫాలో అయితే ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండిమరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండిNo comments:

Post a Comment

Post Bottom Ad

Pages