Bihar: అడ్మిట్ కార్డులపై ప్రధాని, ధోనీ ఫొటోలు.. అవాక్కైన స్డూడెంట్స్.. బిహార్ లో ఘటన | Photos Of PM Modi, MS Dhoni On Bihar University Admit Cards Telugu News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 11 September 2022

Bihar: అడ్మిట్ కార్డులపై ప్రధాని, ధోనీ ఫొటోలు.. అవాక్కైన స్డూడెంట్స్.. బిహార్ లో ఘటన | Photos Of PM Modi, MS Dhoni On Bihar University Admit Cards Telugu News

పరీక్షల (Exams) అడ్మిట్ కార్డులపై అభ్యర్థి పొటో, సంతకం, పరీక్ష తేదీ, కేంద్రం వంటి వివరాలు ఉంటాయి. కానీ ఆ స్టూడెంట్స్ అడ్మిట్ కార్డుపై ఉన్న ఫొటోలు చూసి వారు అవాక్కయ్యారు. వారి ఫొటో ఉండాల్సిన ప్లేస్ లో ప్రముఖుల…

Bihar: అడ్మిట్ కార్డులపై ప్రధాని, ధోనీ ఫొటోలు.. అవాక్కైన స్డూడెంట్స్.. బిహార్ లో ఘటన

Pm Photo On Degree Admit Ca

పరీక్షల (Exams) అడ్మిట్ కార్డులపై అభ్యర్థి పొటో, సంతకం, పరీక్ష తేదీ, కేంద్రం వంటి వివరాలు ఉంటాయి. కానీ ఆ స్టూడెంట్స్ అడ్మిట్ కార్డుపై ఉన్న ఫొటోలు చూసి వారు అవాక్కయ్యారు. వారి ఫొటో ఉండాల్సిన ప్లేస్ లో ప్రముఖుల ఫొటోలు ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. ఇంతకీ అక్కడ ఎవరి ఫొటోలు ఉన్నాయో తెలుసా.. ప్రధాని నరేంద్ర మోడీ, క్రికెటర్ ధోనీ, బిహార్ గవర్నర్ ల ఫొటోలు ఉన్నాయి. వెంటనే సమాచారాన్ని అధికారులకు అందించారు. వారు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. దర్యాప్తునకు ఆదేశించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. బిహార్‌లోని లలిత్‌ నారాయణ్‌ మిథిలా యూనివర్సిటీలో డిగ్రీ పరీక్షల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు (Students అడ్మిట్‌ కార్డులు జారీ చేశారు. అయితే ఆ కార్డుల్లో కొన్నింటిపై ప్రధాని నరేంద్ర మోడీ, క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ, బిహార్‌ గవర్నర్ ఫగూ చౌహాన్‌ ల ఫొటోలు ఉన్నాయి. వీటిపై స్టూడెంట్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయం వివరాలు, పరీక్ష గురించి వెల్లడించాల్సిన అడ్మిట్ కార్డులపై రాజకీయ నాయకుల ఫొటోలు ఉండటం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మధుబని, సమస్తిపూర్‌, బెగుసరాయ్‌ జిల్లాల పరిధిలోని కళాశాలల్లో బీఏ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఇచ్చిన అడ్మిట్ కార్డులపై ఫొటోలు ఉన్నవి ఎక్కువగా వచ్చాయి.

ఈ విషయం యూనివర్సిటీ దృష్టికి రావడంతో అధికారులు వెంటనే రెస్పాండ్ అయ్యారు. అడ్మిట్‌ కార్డుల జారీ ప్రక్రియ ఆన్‌లైన్‌లో కొనసాగుతుందని, విద్యార్థులే తమ ఫొటోలతో పాటు వివరాలను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. వాటిని పరిశీలించి అడ్మిట్‌ కార్డులు జారీ చేస్తామని వెల్లడించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నామని, కొందరు స్టూడెంట్స నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగానే ఇలా జరిగిందని యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ తెలిపారు. విశ్వవిద్యాలయ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించామని, ఆయా విద్యార్థులకు షోకాజ్‌ నోటీసులు జారీచేశామని చెప్పారు. వారిపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేస్తామని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి



లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages