BECIL Recruitment: డిగ్రీ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. | BECIL Recruitment BECIL Invites applications for various posts in guwahati aiims Telugu Education News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday 17 September 2022

BECIL Recruitment: డిగ్రీ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. | BECIL Recruitment BECIL Invites applications for various posts in guwahati aiims Telugu Education News

BECIL Recruitment: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా గువాహటిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) కార్యాలయంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు…

BECIL Recruitment: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా గువాహటిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) కార్యాలయంలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. అవుట్‌ సోర్స్‌ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అప్పర్ డివిజన్ క్లర్క్ (02), డేటా ఎంట్రీ ఆపరేటర్ (01), స్టోర్ కీపర్ (02), క్యాషియర్ (01), అకౌంట్స్ అసిస్టెంట్ (01), జూనియర్ అడ్మిన్ ఆఫీసర్ (02), జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (01), అసిస్టెంట్ స్టోర్స్ ఆఫీసర్ (02) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ, సీఏ ఇంటర్‌, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాతపరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 290-09-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

ఇవి కూడా చదవండి



మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages