Andhra Pradesh: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 6.16 లక్షల ఉద్యోగాలు.. అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ ప్రకటన | Chief Minister YS Jaganmohan Reddy said that 6,16,323 jobs have been created which is unprecedented in the history of Andhra Pradesh state Telugu News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 21 September 2022

Andhra Pradesh: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 6.16 లక్షల ఉద్యోగాలు.. అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ ప్రకటన | Chief Minister YS Jaganmohan Reddy said that 6,16,323 jobs have been created which is unprecedented in the history of Andhra Pradesh state Telugu News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ప్రభుత్వ రంగంలో రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 2019 మే నాటికి రాష్ట్రంలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ప్రభుత్వ రంగంలో రికార్డు స్థాయిలో ఉద్యోగాలు కల్పించినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. 2019 మే నాటికి రాష్ట్రంలో శాశ్వత ఉద్యోగుల సంఖ్య 3,97,128 ఉంటే, అధికారం చేపట్టిన వెంటనే 2,06,638 మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో కేవలం 34,108 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇస్తే, తమ ప్రభుత్వం 2,06,638 మందికి శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించిందని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాంట్రాక్ట్‌ రంగంలో మరో 37,908 ఉద్యోగాలు, అవుట్‌ సోర్సింగ్‌లో 3.71 లక్షల ఉద్యోగాలు.. మొత్తంగా 6,16,323 ఉద్యోగాలు ఇవ్వగలిగామని వివరించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల 51,387 ఉద్యోగాలు, వైద్య ఆరోగ్య రంగంలో రికార్డు స్థాయిలో 16,880 రెగ్యులర్‌ ఉద్యోగాలు, పాఠశాల విద్యాశాఖలో 6,360 ఉద్యోగాలు కల్పించామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

వ్యవసాయం & సహకారంలో 175, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ అభివృద్ధి, మత్స్య పరిశ్రమలో 372, వెనకబడిన తరగతుల సంక్షేమంలో 369, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & పౌర సరఫరాలలో 237, శక్తి లో 8,333, ఫైనాన్స్ లో 101, గ్రామ వాలంటీర్లు/వార్డు వాలంటీర్లు, గ్రామ సెక్రటేరియట్‌లు/వార్డు సెక్రటేరియట్‌లు 3,85,977, ఆరోగ్యం, వైద్యం & కుటుంబ సంక్షేమంలో 40,676, ఉన్నత విద్యలో 1,054, హౌసింగ్ డిపార్ట్మెంట్ లో 1, పరిశ్రమలు & వాణిజ్యంలో 63, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్లులో 2, కార్మిక శాఖలో 81, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ లో 57, పాఠశాల విద్యలో 6,361, నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణలో 1,276, సాంఘిక సంక్షేమంలో 758 ఉద్యోగాలు కల్పించినట్లు సీఎం జగన్ వివరించారు.

అంతే కాకుండా ఏపీఎస్ఆర్టీసీలో 58,388, గిరిజన సంక్షేమంలో 1,175, జలవనరుల శాఖలో 177, మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్లకు 3,500, యూత్ అడ్వాన్స్‌మెంట్, టూరిజం మరియు కల్చర్ లో 92 ఉద్యోగాలు కల్పించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వివరాలు వెల్లడించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి



లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages