TSLPRB: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ కానిస్టేబుల్‌ రాతపరీక్ష.. ఆన్సర్‌ ‘కీ’ విడుదల ఎప్పుడంటే.. | TSLPRB Preliminary Exam ended peacefully, check here answer key release date - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 28 August 2022

TSLPRB: ప్రశాంతంగా ముగిసిన తెలంగాణ కానిస్టేబుల్‌ రాతపరీక్ష.. ఆన్సర్‌ ‘కీ’ విడుదల ఎప్పుడంటే.. | TSLPRB Preliminary Exam ended peacefully, check here answer key release date

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నేడు ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. దాదాపు 1601 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష..

TS Police Constable Answer Key 2022: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నేడు ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. దాదాపు 1601 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు 38 ఇతర సిటీల్లో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రిలిమినరీ రాత పరీక్ష జరిగింది. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 6,03,955 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ త్వరలో అధికారిక వెబ్‌సైట్‌www.tslprb.inలో అందుబాటులో ఉంచనున్నట్లు ఈ సందర్భంగా రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి



కాగా 15,644 సివిల్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (TSLPRB) గత ఏప్రిల్‌ 25న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటితోపాటు 63 ట్రాన్స్‌పోర్ట్‌, 614 కానిస్టేబుల్‌ పోస్టులకు ఏప్రిల్‌ 28, 2022న వేర్వేరు నోటిఫికేషన్లను పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులన్నింటికీ ఉమ్మడిగా ఈ రోజు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించింది. ఇతర అప్‌డేట్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ చెక్‌ చేసుకోవల్సిందిగా అభ్యర్ధులకు బోర్డు సూచించింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages