TS Eamcet 2022 Results: రేపే తెలంగాణ ఎంసెట్‌ 2022 ఫలితాలు! ఇలా చెక్‌ చేసుకోండి.. | TS Eamcet 2022 Results likely to be announced tomorrow - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday 11 August 2022

TS Eamcet 2022 Results: రేపే తెలంగాణ ఎంసెట్‌ 2022 ఫలితాలు! ఇలా చెక్‌ చేసుకోండి.. | TS Eamcet 2022 Results likely to be announced tomorrow

తెలంగాణ ఇంజనీరింగ్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TS EAMCET 2022) ఫలితాలు శుక్రవారం (ఆగస్టు12) విడుదలకానున్నాయి. ఈ మేరకు ఫలితాలు విడుదల చేసేందుకు ఆధాకారులు సన్నాహాలు..

TS Eamcet 2022 Result Date: తెలంగాణ ఇంజనీరింగ్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (TS EAMCET 2022) ఫలితాలు శుక్రవారం (ఆగస్టు12) విడుదలకానున్నాయి. ఈ మేరకు ఫలితాలు విడుదల చేసేందుకు ఆధాకారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోజు (ఆగ‌స్టు 11) సాయంత్రం జేఎన్‌టీయూహెచ్‌లో ఎంసెట్‌ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే ఫలితాల వెల్లడి తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా ఈ ఏడాది జులై 18 నుంచి 21 వరకు జరిగిన తెలంగాణ ఎంసెట్‌ 2022 ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షకు 1.56 లక్షలు, అలాగే జులై 30, 31 తేదీల్లో జరిగిన అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌ పరీక్షకు 80 వేల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రైమరీ ఆన్సర్‌ కీని కూడా ఇప్పటికే విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించే ప్రక్రియ కూడా పూర్తి చేయడం జరిగింది. ఫైనల్‌ ఆన్సర్‌ ‘కీ’తో పాటు ఫలితాల విడుదలకు కూడా తెలంగాణ ఎంసెట్ కమిటీ విశ్లేషించి నిర్ణయం తీసుకోనుంది. అనంతరం విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదగా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సారి బీఎస్సీ నర్సింగ్‌ సీట్లను కూడా ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ర్యాంకుల ఆధారంగానే కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. ఫలితాలు ప్రకటించిన అనంతరం విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://eamcet.tsche.ac.in/ లో రిజల్ట్స్‌ చెక్ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages