థానే డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ (TDCC Bank).. 288 జూనియర్ అసిస్టెంట్, ప్యూన్ పోస్టుల (Jr Clerk & Peon Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..
TDCC Bank Jr Clerk Recruitment 2022: థానే డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ (TDCC Bank).. 288 జూనియర్ అసిస్టెంట్, ప్యూన్ పోస్టుల (Jr Clerk & Peon Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి 8వ తరగతి, పదో తరగతి, డిగ్రీ, గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత కలిగిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 26, 2022వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 5, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు రూ.944, ప్యూన్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు రూ.590లు దరఖాస్తు రుసుముగా చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభ కనబరచిన వారికి ప్యూన్ పోస్టులకు రూ.10,000లు, జూనియర్ క్లర్క్ పోస్టులకు రూ.15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.thanedistrictbank.com
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.https://ift.tt/a3Vpg1i
770987,772377,772391,772398
No comments:
Post a Comment