SAIL jobs 2022: టెన్త్‌ అర్హతతో.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 146 ఉద్యోగాలు..పూర్తి వివరాలివే.. | SAIL Recruitment 2022 for 146 Attendant cum Technician Trainee (NAC) posts. apply online - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 26 August 2022

SAIL jobs 2022: టెన్త్‌ అర్హతతో.. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 146 ఉద్యోగాలు..పూర్తి వివరాలివే.. | SAIL Recruitment 2022 for 146 Attendant cum Technician Trainee (NAC) posts. apply online

భారత ప్రభుత్వ సంస్థ అయిన బొకారోలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL Bokaro).. 146 అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రైనీ (NAC) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

SAIL Attendant cum Technician Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన బొకారోలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL Bokaro).. 146 అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌ ట్రైనీ (NAC) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు సెప్టెంబర్‌ 15, 2022వ తేదీ నాటికి 28 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆ అర్హతలున్నవారు సెప్టెంబర్‌ 15, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుముగా రూ.200లు ప్రతి ఒక్కరూ చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.9000ల నుంచ రూ.17000ల స్టైపెండ్‌ చెల్లిస్తారు.

రాత పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు గానూ 100 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలకు 90 నిముషాల్లో పరీక్ష రాయవల్సి ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్‌ నుంచి 40 ప్రశ్నలు, లాజికల్‌ రీజనింగ్‌ నుంచి30 ప్రశ్నలు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 30 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages