NALCO Recruitment: బీటెక్‌ అర్హతతో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 40 వేలు జీతం.. | Nalco recruitment 2022 national aluminium company limited invites applications for engineer trainee posts Telugu Education News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday 10 August 2022

NALCO Recruitment: బీటెక్‌ అర్హతతో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 40 వేలు జీతం.. | Nalco recruitment 2022 national aluminium company limited invites applications for engineer trainee posts Telugu Education News

NALCO Recruitment: నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌ (NALCO) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మైనింగ్ సంస్థలో ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.?

NALCO Recruitment: నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌ (NALCO) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ మైనింగ్ సంస్థలో ఇంజనీర్‌ ట్రైనీ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 189 పోస్టులను భర్తీ చేయనున్నారు.

* వీటిలో మెకానికల్‌ (58), ఎలక్ట్రికల్‌ (41), ఇన్‌స్ట్రుమెంటేషన్‌ (32), కెమికల్‌ (14), మెటలర్జీ (14), సివిల్‌ (07), మైనింగ్ (10), కెమెస్ట్రీ (13) ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంజనీరింగ్ విభాగంలో 65 శాతం మార్కులతో డిగ్రీ/ ఎమ్‌ఎస్‌సీ (కెమిస్ట్రీ) పూర్తి చేసి ఉండాలి. గేట్‌ 2022 మార్కులను ప్రామాణికంగా తీసుకుంటారు. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణ 11-08-2022వ తేదీన మొదలై 11-09-2022తో ముగియనుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40 వేలు జీతంగా అందిస్తారు.

* జనరల్‌ అభ్యర్థులు రూ. 500, ఎస్‌సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ రూ. 100 అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించాలి.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

ఇవి కూడా చదవండి



మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages