JEE Main Results: జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి | JEE Main Result 2022 DECLARED at jeemain.nta.nic.in, get direct LINK to check scorecard here Telugu National News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 8 August 2022

JEE Main Results: జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి | JEE Main Result 2022 DECLARED at jeemain.nta.nic.in, get direct LINK to check scorecard here Telugu National News

JEE Main Results 2022: దేశంలోని అత్యుత్తమ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (NTA) విడుదల చేసింది.

JEE Main Results 2022: దేశంలోని అత్యుత్తమ ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (NTA) విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ ర్యాంకులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. కాగా ఆదివారం ర్యాంకులను విడుదల చేయకుండా కేవలం ప్రొవిజనల్‌ ఫైనల్‌ కీని మాత్రమే ఎన్‌టీఏ విడుదల చేసింది. తాజాగా ర్యాంకులను కూడా విడుదల చేసింది. ఇక తాజా ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. పి.రవిశంకర్‌ ఆరో ర్యాంకు సాధించగా.. ఎం.హిమవంశీ ఏడు, పల్లి జయలక్ష్మి తొమ్మిదో ర్యాంకు దక్కించుకున్నారు. విద్యార్థులు జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌ ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్ నంబర్‌ను ఎంటర్‌ చేసి రిజల్ట్స్‌, స్కోరుకార్డును డౌన్‌లౌడ్‌ చేసుకోవచ్చు.

కాగా JEE మెయిన్స్ 2022లో ఉత్తీర్ణులైన విద్యార్థులు JEE అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్‌కు హాజరయ్యే అవకాశం పొందుతారు. కాగా JEE మెయిన్ ఫలితాల కంటే ముందే JEE అడ్వాన్స్‌డ్ 2022 రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది . విదేశీ విద్యార్థుల కోసం ఆగస్టు 1 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 28న జేఈఈ అడ్వాన్స్‌డ్-2022 పరీక్షజరగనుంది. ఎగ్జామ్‌ను రెండు పేపర్లుగా నిర్వహించనున్నారు. రెండూ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. పేపర్-1 పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు.. పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి జరగనుంది.

ఇవి కూడా చదవండి



మరిన్ని కెరీర్ & ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages