భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP).. ఒప్పంద ప్రాతిపదికన 52 కానిస్టేబుల్ (పురుషులు-44, మహిళలు-8) పోస్టులకు (Constable Posts) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..
ITBP Group ‘C’ Non Gazetted Recruitment 2022: భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP).. ఒప్పంద ప్రాతిపదికన 52 కానిస్టేబుల్ (పురుషులు-44, మహిళలు-8) పోస్టులకు (Constable Posts) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి పదో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు సెప్టెంబర్ 17, 2022 నాటికి 18 నుంచి 25 యేళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 27, 2022వ తేదీ అర్థరాత్రి 11 గంటల 59 నిముషాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 29వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్/ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.
No comments:
Post a Comment