IIIT Basara: బాసర ట్రిపుల్‌ ఐటీలో నిలిచి పోయిన విద్యుత్‌ సరఫరా.. విద్యార్థుల ఇబ్బందులు.. | There is power cut in iiit basara From monday afternoon. students started protesting - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 9 August 2022

IIIT Basara: బాసర ట్రిపుల్‌ ఐటీలో నిలిచి పోయిన విద్యుత్‌ సరఫరా.. విద్యార్థుల ఇబ్బందులు.. | There is power cut in iiit basara From monday afternoon. students started protesting

IIIT Basara: బాసర ట్రిపుల్‌ నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొన్నటి వరకు విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు…

IIIT Basara: బాసర ట్రిపుల్‌ నిత్యం ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొన్నటి వరకు విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. దీంతో గత కొన్ని రోజులుగా బాసర ట్రిపుల్‌ ఐటీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ వ్యవహారం ఇంకా చల్లారకముందే సోమవారం బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సోమవారం మధ్యాహ్నం నుంచి క్యాంపస్‌లో కరెంట్‌ కోత ఉంది. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో రాత్రి భోజన ఏర్పాట్లుకు ఆటంకం నెలకొంది.

కరెంట్‌ కోతపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చీకట్లోనే విద్యార్థులు భోజనం చేస్తున్నారు. కరెంట్‌ లేకపోవడంతో విద్యార్థులు హాస్టల్‌లో సెల్ పోన్ వెలుతురులో గడుపుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, విద్యార్థుల హాస్టల్స్‌ చీకట్లోనే ఉన్నాయి. మెస్‌లో వంటను మిషన్ల ద్వారా చేయడంతో విద్యుత్‌ సరఫర ఆగిపోయిన కారణంగా రాత్రి భోజనం ఆలస్యమైంది.

ఇదిలా ఉంటే ట్రిపుల్‌ ఐటీలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడానికి క్యాంపస్‌లోని సబ్‌ స్టేషన్‌లో నెలకొన్ని సాంకేతక సమస్యగా కారణంగా తెలుస్తోంది. విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో స్టడీ అవర్స్‌ను ఇంచార్జ్‌ వీసీ రద్దు చేశారు. విద్యార్థులకు భోజన ఏర్పాట్లకు ప్రత్నామ్యాయ మార్గం కోసం అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages