IB Recruitment 2022: ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు తెలుసుకోండి.. | Intelligence Bureau (IB) Recruitment 2022 for 157 DCIO and Other Posts. Check full details here - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 30 August 2022

IB Recruitment 2022: ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు తెలుసుకోండి.. | Intelligence Bureau (IB) Recruitment 2022 for 157 DCIO and Other Posts. Check full details here

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో (IB).. 157 అడ్వైజర్/టెక్, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్/టెక్ తదితర పోస్టుల భర్తీకి (Group A Posts) అర్హులైన..

IB DCIO (Group A) Recruitment 2022: భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో (IB).. 157 అడ్వైజర్/టెక్, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్/టెక్, అదనపు డిప్యూటీ డైరెక్టర్/క్రిప్టో, జాయింట్ డిప్యూటీ డైరెక్టర్/ఎగ్జిక్యూటివ్‌, అసిస్టెంట్ డైరెక్టర్/ఎగ్జిక్యూటివ్‌, సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి (Group A Posts) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులను డిప్యుటేషన్‌ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. గ్రూప్‌ ‘ఏ’ గెజిటెడ్‌ ర్యాంక్‌ ఆఫీసర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన వారు డిప్యుటేషన్‌పై 3 నుంచి 5 యేళ్ల వరకు పదవిలో కొనసాగవచ్చు. గరిష్ఠంగా ఏడేళ్ల వరకు పదవీకాలం పొడిగించే అవకాశం ఉంది. స్పెషల్‌ సెక్యురిటీ అలవెన్స్‌ కింద 20 శాతం బేసిక్‌ జీతం చెల్లిస్తారు. దీనితోపాటు యూనిఫాం అలవెన్స్‌ కింద రూ.10,000లు, చిల్డ్రన్‌ ఎడ్యుకేషన్‌ అలవెన్స్‌ కింద రూ.27,000లు అదనంగా చెల్లిస్తారు. ఆసక్తి కలిగినవారు నోటిఫికేషన్‌ విడుదలైన 60 రోజుల్లోపు ఆఫ్‌లైన్‌ విధానంలో కింది అడ్రస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ ఆగస్టు 27, 2022వ తేదీన విడుదలైంది. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: The Assistant Director, Intelligence Bureau, Ministry of Home Affairs, 35 S P Marg, Bapu Dham, New Delhi – 110021.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages