Hyderabad: బాచుపల్లి ఇంజనీరింగ్‌ విద్యార్ధినికి భారీ ప్యాకేజీతో జాబ్‌ ఆఫర్‌! | Hyderabad News: Bachupally Engineering student bags RS 54.75 lakh package with Alto Company job - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 14 August 2022

Hyderabad: బాచుపల్లి ఇంజనీరింగ్‌ విద్యార్ధినికి భారీ ప్యాకేజీతో జాబ్‌ ఆఫర్‌! | Hyderabad News: Bachupally Engineering student bags RS 54.75 lakh package with Alto Company job

తెలంగాణ రాష్ట్ర విద్యార్ధినికి అరుదైన ఘనత దక్కింది. బాచుపల్లిలోని బీవీఆర్‌ఐటీ మహిళా ఇంజినీరింగ్‌ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని క్యాంపస్ ఇంటర్వ్యూలో భారీ ప్యాకేజీతో..

Bachupally Engineering student got job with high package: తెలంగాణ రాష్ట్ర విద్యార్ధినికి అరుదైన ఘనత దక్కింది. బాచుపల్లిలోని బీవీఆర్‌ఐటీ మహిళా ఇంజినీరింగ్‌ కాలేజీలో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని క్యాంపస్ ఇంటర్వ్యూలో భారీ ప్యాకేజీతో కూడిన ఉద్యోగం సొంతం చేసుకుంది. ఈ కాలేజీలో వారం రోజుల క్రితం జరిగిన ప్రాంగణ నియామకాల్లో అక్కడ ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థినులు భారీ వేతనాలతో కూడిన ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

ఇవి కూడా చదవండి



ప్రాంగణ నియామకాల్లో ఐటీ విద్యార్థిని సంజనరెడ్డికి దాదాపు రూ.54.75 లక్షల వార్షిక వేతనంతో ఆల్తో సంస్థ జాబ్‌ ఆఫర్‌ అందించింది. నీరజ అనే మరో విద్యార్ధినికి మైక్రోసాఫ్ట్‌ సంస్థ రూ.49.25 లక్షల వార్షిక వేతనంతో ఆఫర్‌ ఇచ్చింది. ఇంకా శివాని, వైష్ణవి, ప్రవళిక విద్యార్ధులకు అమెజాన్‌ సంస్థ రూ.44 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు ఇచ్చింది. సౌమ్యకు అడోబీ సంస్థ రూ.40.2 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగావకాశం కల్పించింది. దాదాపు10 మంది విద్యార్థినులకు పలు కంపెనీలలో రూ.30 లక్షలకు పైగా వార్షిక వేతనంతో ఉద్యోగావకాశాలు పొందారు. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగావకాశాలు పొందిన విద్యార్ధినులను కాలేజీ యాజమన్యం ప్రత్యేకంగా ప్రశంసించింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages