భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన 169 సీనియర్ రెసిడెంట్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి..
ESIC Sanathnagar Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC Hyderabad).. ఒప్పంద ప్రాతిపదికన 169 సీనియర్ రెసిడెంట్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల (Faculty and Super Specialist Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసెస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్, ప్రెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత స్పెషలేజేషన్‌లో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. అలాగే దరఖాస్తు దారుల వయసు 69 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు సెస్టెంబర్ 8, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.1000లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళలు/ఇతర అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
విభాగాలు:
రేడియో డయాగ్నోసిస్, ఎమర్జెన్సీ మెడిసిన్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్, హెమటాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, పీడియాట్రిక్ క్రిటికల్ కేర్, న్యూరోసర్జరీ, CTVS, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, అనాటమీ, ఫిజియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, OBGY, అనాస్టిసియాలజీ, జనరల్ సర్జరీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
ఖాళీల వివరాలు:
- ప్రొఫెసర్ పోస్టులు: 9
- అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు: 22
- అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు: 35
- సీనియర్ రెసిడెంట్ పోస్టులు: 73
- స్పెషలిస్ట్ పోస్టులు: 13
- సూపర్ స్పెషలిస్ట్ పోస్టులు:14
ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.
No comments:
Post a Comment