ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు చెందిన విజయనగరం జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం పరిధిలోని (DMHO Vijayanagaram) ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 194 మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
DMHO Vizianagaram Para Medical Staff Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు చెందిన విజయనగరం జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం పరిధిలోని (DMHO Vijayanagaram) ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన 194 మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి/ఐటీఐ/ఇంటర్మీడియట్/డిగ్రీ/ పీజీ/డిప్లొమా/డీఫార్మసీ/బీఫార్మసీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టరయ్యి ఉండాలి. అర్హత కలిగిన అభ్యర్ధులు ఆగస్టు 20, 2022లోపు కింది అడ్రస్‌కు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుముగా ప్రతి ఒక్కరూ రూ.250ల చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఫిజికల్ ఛాలెంజెడ్ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. అకడమిక్ మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.15,000ల నుంచి రూ.38,720 వరకు జీతంగా చెల్లిస్తారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు..
- అనస్థీషియా టెక్నీషియన్ పోస్టులు: 10
- ఆడియో విజువల్ టెక్నీషియన్ పోస్టులు: 1
- ఆడియోమెట్రీ టెక్నీషియన్/ ఆడియోమెట్రీషియన్ పోస్టులు: 2
- బయో మెడికల్ టెక్నీషియన్ పోస్టులు: 3
- కౌన్సెలర్/ఎంఎస్‌డబ్ల్యూ గ్రేడ్-2 పోస్టులు: 1
- డెంటల్ టెక్నీషియన్ పోస్టులు: 1
- ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు: 2
- ఎలక్ట్రీషియన్ పోస్టులు: 1
- ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులు: 10
- జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు: 80
- మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ పోస్టులు: 2
- ల్యాబ్ అటెండెంట్ పోస్టులు: 11
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులు: 20
- లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు: 4
- మార్చురీ అటెండెంట్ పోస్టులు: 5
- ఓటీ టెక్నీషియన్ పోస్టులు: 6
- ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు: 11
- ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్/ రిఫ్రాక్షనిస్ట్ పోస్టులు: 1
- ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు: 11
- ఫిజియోథెరపిస్ట్ పోస్టులు: 2
- ప్లంబర్ పోస్టులు: 2
- స్టోర్ అటెండర్ పోస్టులు: 4
- శానిటరీ వర్కర్ కమ్ వాచ్‌మెన్ పోస్టులు: 2
- ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు: 2
అడ్రస్: DMHO/DME (Teaching Hospital’s) /DCHS Govt. Health facilities in Vizianagaram District, AP.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.
No comments:
Post a Comment