DMHO Krishna Jobs: కృష్ణా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక.. | DMHO Krishna Recruitment 2022 for 296 Anaesthesia Technician, 2 Audio Visual Technician other posts - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday 9 August 2022

DMHO Krishna Jobs: కృష్ణా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్‌ స్టాఫ్‌ ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక.. | DMHO Krishna Recruitment 2022 for 296 Anaesthesia Technician, 2 Audio Visual Technician other posts

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం (DMHO Krishna), వైద్య విధాన పరిషత్‌, డీహెచ్‌.. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన 296 మెడికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..

DMHO Krishna Para Medical Staff Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం (DMHO Krishna), వైద్య విధాన పరిషత్‌, డీహెచ్‌.. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన 296 మెడికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ వైద్యారోగ్య శాఖ ఉమ్మడి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి పదోతరగతి/ సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/ఇంటర్/డిప్లొమా/ఎమ్‌సీఏ/బీటెక్‌/బీఈ/ఎంటెక్‌/ఎంఈ/బీఎస్సీ/ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టరయ్యి ఉండాలి. జులై 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించకుండా ఉండాలి. అర్హతలు, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆగస్టు 20, 2022 సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌కు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుముగా ప్రతి ఒక్కరూ రూ.250ల చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఫిజికల్‌ ఛాలెంజెడ్‌ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. అభ్యర్ధులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.15,000ల నుంచి రూ.61,960వరకు జీతంగా చెల్లిస్తారు.

అనస్థీషియా టెక్నీషియన్ పోస్టులు 22
ఆడియో విజువల్ టెక్నీషియన్ పోస్టులు 1
ఆడియోమెట్రీ టెక్నీషియన్ పోస్టులు 2
బయో మెడికల్ ఇంజినీర్ పోస్టులు 1
బయో మెడికల్ టెక్నీషియన్ పోస్టులు 3
కార్డియాలజీ టెక్నీషియన్ పోస్టులు 2
డెంటల్ హైజీనిస్ట్ పోస్టులు 4
డెంటల్ టెక్నీషియన్ పోస్టులు 1
రేడియోగ్రాఫర్ పోస్టులు16
ఈసీజీ టెక్నీషియన్ పోస్టులు 6
ఈజీసీ టెక్నీషియన్ పోస్టులు 1
ఎలక్ట్రీషియన్ పోస్టులు 5
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులు 13
జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు 70
మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ పోస్టులు 3
ల్యాబ్ అటెండెంట్ పోస్టులు 11
ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్‌-2 పోస్టులు 30
లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులు 4
మార్చురీ అటెండెంట్ పోస్టులు5
ఓటీ టెక్నీషియన్ పోస్టులు 5
ఆక్యుపేషనల్ థెరపిస్ట్ పోస్టులు 5
ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 24
పెర్ఫ్యూషనిస్ట్ పోస్టులు 1
ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్/ రిఫ్రాక్షనిస్ట్ పోస్టులు 6
ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 పోస్టులు 21
ఫిజియోథెరపిస్ట్ పోస్టులు 5
ప్లంబర్ పోస్టులు 4
రేడియోలాజికల్ ఫిజిసిస్ట్ పోస్టులు1
స్పీచ్ థెరపిస్ట్ పోస్టులు 1
స్టెరిలైజేషన్ టెక్నీషియన్ పోస్టులు 2
స్టోర్ అటెండర్ పోస్టులు 4
శానిటరీ వర్కర్ కమ్ వాచ్‌మెన్ పోస్టులు10
ఫీమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ పోస్టులు11

అడ్రస్‌: District Medical and Health Officer, Parasupeta, Near Nayarbaddi centre, Machilipatnam Krishna, AP.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages