BEL Recruitment 2022: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలు.. నెలకు రూ.90,000ల జీతం.. | BEL Recruitment 2022 for 13 Engineering Assistant Trainee Posts, check last date, selection process here jobs in telugu - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 17 August 2022

BEL Recruitment 2022: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ ఉద్యోగాలు.. నెలకు రూ.90,000ల జీతం.. | BEL Recruitment 2022 for 13 Engineering Assistant Trainee Posts, check last date, selection process here jobs in telugu

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోనున్న భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL Ghaziabad).. శాశ్వత ప్రాతిపదికన 13 ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (Engineering Assistant Trainee Posts) పోస్టుల..

BEL Engineering Assistant Trainee Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోనున్న భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL Ghaziabad).. శాశ్వత ప్రాతిపదికన 13 ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (Engineering Assistant Trainee Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్/మెకానికల్ విభాగాల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమాలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే జులై 31, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 28 యేళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 5, 2022 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుముగా జనరల్ అభ్యర్ధులు రూ.295లు తప్పనినసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, మెడికల్ టెస్టు ద్వారా ఎంపిక చేస్తారు. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.24,500ల నుంచి రూ.90,000ల జీతంతో ఉద్యోగావకాశం కల్పిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిపికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages